IPL 2024 : హార్దిక్ పాండ్యాకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. రోహిత్ కూడానా.. !

Mumbai Indians : ప్లేఆఫ్ రేసు ఆశలు గ‌ల్లంతు బాధ‌లో ఉన్న ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ త‌గిలింది. హార్దిక్ తో పాటు జట్టు సభ్యులందరికీ బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది.
 

IPL 2024: Bcci gives big shock to Mumbai Indians captain Hardik Pandya Rohit Sharma too RMA

Big shock for Hardik Pandya : ఐపీఎల్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతు కావడంతో బాధ‌లో ఉన్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మ‌రో షాక్ త‌గిలింది. అత‌నితో పాటు జ‌ట్టులోని స‌భ్యుల‌కు బిగ్ షాక్ ఇస్తూ భారీ జరిమానా పడింది. లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ స్లో ఓవర్ రేట్ చేసినందుకు మ్యాచ్ రిఫరీ రూ.24 లక్షల జరిమానా విధించాడు. ఈ సీజన్‌లో స్లో ఓవర్‌ రేటు పునరావృతం కావడం, జరిమానా 24 లక్షలకు చేరడం ఇది రెండోసారి.

హార్దిక్‌తో పాటు, జట్టు సభ్యులందరికీ వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ. 6 లక్షలు, ఏది తక్కువైతే అది జరిమానా విధించాలని మ్యాచ్ రిఫరీ పేర్కొన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్‌కు కూడా పెనాల్టీ నుండి మినహాయింపు లేదు. మంగ‌ళ‌వారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత సమయానికి ఒక ఓవర్ కంటే తక్కువ బౌలింగ్ చేసింది. దీంతో ముంబై చివరి ఓవర్‌లో నలుగురు ఫీల్డర్‌లను మాత్రమే బౌండరీపై ఉంచగలిగింది.

India T20 WC 2024 squad : కేఎల్ రాహుల్ కు మ‌ద్ద‌తుగా ప్ర‌ముఖ‌ బాలీవుడ్ స్టార్..

145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ముహమ్మద్ నబీ వేసిన చివరి ఓవర్‌లో విజయానికి మూడు పరుగులు కావాలి. నికోలస్ పురాన్ తొలి బంతికి డబుల్, రెండో బంతికి సింగిల్ తీసి లక్నోను సులువుగా లక్ష్యానికి చేర్చాడు. ముంబై 10 మ్యాచ్‌ల్లో 7వ సారి ఓడిపోయి ఇప్పుడు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. నెట్ రన్ రేట్‌లో ముంబై కేవలం ఆరు పాయింట్లతో అట్టడుగున ఉన్న ఆర్సీబీ కంటే కొంచెం ఆధిక్యంలో ఉంది.

ఈ సీజన్‌లో మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే ముంబై 14 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశను కాపాడుకోగలదు. అన్ని మ్యాచ్‌ల్లో విజయంతో పాటు ఇతర జట్ల ప్రదర్శనపైనే ముంబై ప్లేఆఫ్ అవకాశాలు ఇప్పుడు ఆధారపడి ఉన్నాయి. అయితే, గ‌త ఐపీఎల్ సీజన్ ప్లేఆఫ్ సాధించిన జ‌ట్ల‌ను గ‌మ‌నిస్తే అన్ని జ‌ట్లు కూడా 14కు పైగా పాయింట్ల‌తోనే టాప్ - 4 లోకి అర్హ‌త సాధించాయి. కాబ‌ట్టి 14 పాయింట్ల‌తో టాప్-4లో నిల‌వ‌డం క‌ష్ట‌మే.. అంటే ముంబై ఇండియ‌న్స్ ప్లేఆఫ్ కే చేర‌డం దాదాపు అసాధ్యం. ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప ప్లే ఆప్ కు చేర‌లేదు.

IPL 2024 : ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ ఔట్.. అయ్యో హార్దిక్ భ‌య్యా ఎంత ప‌నిచేశావ్.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios