`పుష్ప2` నుంచి అంతా వెయిట్ చేస్తున్న సమయం వచ్చింది. `పుష్ప పుష్ప` పాట రానే వచ్చింది. పుష్ప రేంజ్‌ని తెలియజేసేలా సాగే ఈ పాట ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న `పుష్ప2` నుంచి తొలి పాట వచ్చింది. `పుష్ప పుష్ప` అంటూ సాగే పాటని విడుదల చేయబోతున్నట్టు టీమ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాటని విడుదల చేశారు. ఈ సాయంత్రం `పుష్ప పుప్పు.. పుష్ప పుష్ప `అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. పుష్ప రాజ్ క్యారెక్టర్‌ని, పుష్పరాజ్ ఇమేజ్‌ని తెలియజేసేలా ఈ పాట సాగింది. గాంభీర్యమైన స్వరంగా ఈ సాంగ్ సాగడం విశేషం.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటని చంద్రబోస్ రాయగా, నకాష్ అజిజ్, దీపక్ బ్లూ ఆలపటించారు. `పుష్ప` సినిమాలో తొలి పాట నేచర్ గురించి చెప్పినట్టుగానే `పుష్ప2`లోనూ ఈ `పుష్ప పుష్ప` పాట ఉండటం విశేషం. సేమ్‌స్టయిల్‌ని ఫాలో అయ్యారు సుకుమార్. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ఈ పాటని విడుదల చేశారు. ఈ పాట ఆకట్టుకుంటుంది. ఆలోచింప చేస్తుంది. `పుష్ప2` సినిమా స్థాయిలోనే పాట కూడా అదిరిపోయేలా ఉంది. అంతేకాదు ఇందులో పుష్ప బ్రాండ్‌ని కూడా చూపించడం విశేషం. ఇది బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుండటం విశేషం.
ఇక అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. టీజర్ చివర్లో బన్నీ ఇచ్చే యాక్షన్ అదిరిపోయింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఈగర్ మొత్తం వెయిట్ చేస్తుంది.

