ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ మెగాఫ్యామిలీ మీద చేసిన ఐదు కామెంట్లకు కౌంటర్లు ఇచ్చిన మెగాబ్రదర్ నాగబాబు తాజాగా ఆరో కామెంట్ గురించి ప్రస్తావించాడు. ముందుగా తను ఇంతకాలం తరువాత ఎందుకు రియాక్ట్ అయ్యాననే విషయంపై నాగబాబు మాట్లాడారు.
ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ మెగాఫ్యామిలీ మీద చేసిన ఐదు కామెంట్లకు కౌంటర్లు ఇచ్చిన మెగాబ్రదర్ నాగబాబు తాజాగా ఆరో కామెంట్ గురించి ప్రస్తావించాడు. ముందుగా తను ఇంతకాలం తరువాత ఎందుకు రియాక్ట్ అయ్యాననే విషయంపై నాగబాబు మాట్లాడారు.
''చాలా మంది మీడియాలో ఇంతకాలం తరువాత ఎందుకు రియాక్ట్ అయ్యారని అడుగుతున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు.. కానీ ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవంటూ'' స్పష్టం చేశారు.
అసలు రియాక్ట్ అవ్వడానికి టైమ్ ఏంటి..? అని ప్రశ్నించిన నాగబాబు.. దానికొక ఉదాహరణ కూడా ఇచ్చాడు. అదేంటంటే.. మన ఇంట్లో ఒకడు దొంగతనం చేశాడు.. సంవత్సరం తరువాత కనిపిస్తే దొంగ కదా అని వదిలేస్తామా..? అప్పుడు రియాక్ట్ అవుతాం కదా ఇది కూడా అంతే అని స్పష్టం చేశాడు.
ఇక ఆరో కామెంట్ పై కౌంటర్ ఇచ్చారు. కామెంట్ ఏంటంటే.. 2012 లో బాలయ్య.. ''చిరంజీవి ఎన్టీఆర్ కాలి గోటికి కూడా పని చేయడు'' అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చాడు.
దీనికి కౌంటర్ గా నాగబాబు మాట్లాడుతూ.. ''ఇలాంటి డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చినా.. ఎవరూ మాట్లాడలేదు. చాలా కోపం ఆవేదన కలిగాయి.. కానీ అన్నయ్య పెద్దరికంగా ఓ సమాధానం ఇచ్చి ఊరుకున్నారు. ఆవేశాన్ని, బాధని చంపుకొని కూర్చున్నాం. మీ నాన్నగారు మీకు గొప్ప.. ఏ కొడుకైనా తండ్రి గొప్పోడే.. మీ నాన్నగారి గురించి మీరు గొప్పగా మాట్లాడుకోండి.. అందులో తప్పు లేదు కానీ వేరొకరి గురించి తప్పుగా మాట్లాడతారా..? ఎంత అహంకారం మీకు..? ఏ మాకు మాట్లాడడం చేతకాదా..?'' అంటూ మండిపడ్డారు.
''మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము మాట్లాడలేదు.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి.. లూజ్ టంగ్ మాటలు మాట్లాడకండి.. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నామనే తప్ప చేతకాక కాదు..'' అంటూ బాలయ్యకి వార్నింగ్ ఇచ్చారు.
''మా అన్నయ్య మాకు తండ్రిలాంటి వాడు.. మా మధ్య కూడా అభిప్రాయబేధాలు ఉంటాయి కానీ మా అన్నదమ్ముల మధ్య అనుబంధం చెక్కుచెరగదు.. మేము కలిసుండే అన్నదమ్ములం.. కొట్టుకునే అన్నదమ్ములం కాదు..'' అంటూ బాలయ్యకి కౌంటర్ ఇచ్చాడు.
''ఇండస్ట్రీ మొత్తం మీకు గులాములు కాదు..'' అంటూ ఫైర్ అయ్యారు. ఇక తాను ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు, బాలకృష్ణ దీన్ని కంటిన్యూ చేస్తే అది ఆయన ఇష్టమని స్పష్టం చేశాడు.
మా అన్నయ్య ఆపారని ఊరుకున్నా.. బాలయ్యపై నాగబాబు ఫైర్!
'ఎర్రోడి వీరగాధ'.. బాలయ్యపై నాగబాబు షార్ట్ ఫిల్మ్!
నాగబాబు కౌంటర్లపై బాలయ్య నో కామెంట్!
బాలయ్యపై నాగబాబు కౌంటర్లు.. మధ్యలో వర్మ సెటైర్!
మిగిలినవన్నీ సంకర పార్టీలా..? బాలయ్యపై మండిపడ్డ నాగబాబు!
నెక్స్ట్ ఎలెక్షన్స్ లో నిలబడండి చూద్దాం.. బాలయ్యకి నాగబాబు వార్నింగ్!
మీరేమైనా దిగొచ్చారా..? బాలయ్యపై నాగబాబు మూడో కామెంట్!
మీరేనా సూపర్ స్టార్లు.. బాలయ్యపై విరుచుకుపడ్డ నాగబాబు!
బాలయ్య వర్సెస్ నాగబాబు.. కామెంట్ నెం 1!
ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!
బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 11, 2019, 10:17 AM IST