నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజులుగా నాగబాబు కౌంటర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై నటి శ్రీరెడ్డి సెటైరికల్ గా ఓ వీడియో పోస్ట్ చేసింది.
నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజులుగా నాగబాబు కౌంటర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై నటి శ్రీరెడ్డి సెటైరికల్ గా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా దీనిపై స్పందించాడు.
సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై సెటైర్ వేశాడు. ఆయన పెట్టిన పోస్ట్ లో ''కామెంట్లలో నన్ను మించిపోయారనే నా జెలసీ బాధ ఒక వైపు.. తన స్టార్ బ్రదర్స్ ని డిఫెండ్ చేయడంలో సూపర్ స్టార్ అయిపోయారనే ఆనందం ఒక వైపు.. ఒక కంట కన్నీరు.. మరో కంట పన్నీరు.. నాగబాబు గారు హ్యాట్సాఫ్.. మీ సోదరులను మీరు ప్రేమించేంతగా నేను కూడా ప్రేమిస్తున్నాను'' అంటూ రాసుకొచ్చాడు.
నాగబాబు విషయానికొస్తే.. బాలకృష్ణ పలు సందర్భాల్లో మెగాఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ చేసిన ఆరు కామెంట్స్ ని పట్టుకొని ఇప్పుడు ఒక్కో కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నాడు. ఇప్పటికే ఐదు కామెంట్లకు కౌంటర్లు ఇచ్చిన నాగబాబు ఇప్పుడు ఆరో కామెంట్ కి కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
మిగిలినవన్నీ సంకర పార్టీలా..? బాలయ్యపై మండిపడ్డ నాగబాబు!
నెక్స్ట్ ఎలెక్షన్స్ లో నిలబడండి చూద్దాం.. బాలయ్యకి నాగబాబు వార్నింగ్!
మీరేమైనా దిగొచ్చారా..? బాలయ్యపై నాగబాబు మూడో కామెంట్!
మీరేనా సూపర్ స్టార్లు.. బాలయ్యపై విరుచుకుపడ్డ నాగబాబు!
బాలయ్య వర్సెస్ నాగబాబు.. కామెంట్ నెం 1!
ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!
బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్
