నందమూరి బాలకృష్ణపై గత కొద్దిరోజులుగా మండిపడుతున్నారు మెగాబ్రదర్ నాగబాబు. పలు సందర్భాల్లో బాలయ్య మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ కి వీడియోల రూపంలో కౌంటర్లు ఇస్తున్నారు. నాగబాబు కౌంటర్లు ఎక్కువవుతుండడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా నాగబాబు మరో వీడియో వదిలాడు. తాను ఇంతగా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. తాను ఎప్పుడూ బాలకృష్ణని వ్యక్తిగతంగా విమర్శించలేదని, తన ఫేస్ బుక్ పోస్ట్ లలో బాలయ్య పేరు ప్రస్తావించలేదని అన్నారు.

పవన్ కళ్యాణ్ పై బాలకృష్ణ వ్యక్తిగతంగా చాలా విమర్శలు చేశారని ఓ అన్నగా నేను రియాక్ట్ అయితే తప్పేంటని ప్రశ్నించారు. బాలకృష్ణ ఎవరో తెలియదు.. పెద్ద బాలకృష్ణ తెలుసని చెప్పినందనుకు ఇంత వివాదం చేస్తారా..? అని మండిపడ్డారు. అయిన బాలకృష్ణ పేరు ఎక్కగా ప్రస్తావించలేదని స్పష్టం చేస్తూ.. గుమ్మడికాయల దొంగ ఎవరంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించాడు.

మెగాబ్రదర్స్ పై బాలకృష్ణ ఐదు సార్లు నోరు జారి వ్యక్తిగతంగా విమర్శించినా.. తాము ఏమనలేదని అన్నారు. 2011 లో చిరంజీవిపై బాలయ్య చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చి ఈ వివాదానికి ముగింపు పలుకుతానని నాగబాబు స్పష్టం చేసారు. నిజానికి అప్పుడే కౌంటర్ ఇవ్వాలనుకున్నా తన అన్నయ్య ఆపారని నాగబాబు చెప్పారు. 

 

'ఎర్రోడి వీరగాధ'.. బాలయ్యపై నాగబాబు షార్ట్ ఫిల్మ్!

నాగబాబు కౌంటర్లపై బాలయ్య నో కామెంట్!

బాలయ్యపై నాగబాబు కౌంటర్లు.. మధ్యలో వర్మ సెటైర్!

మిగిలినవన్నీ సంకర పార్టీలా..? బాలయ్యపై మండిపడ్డ నాగబాబు!

నెక్స్ట్ ఎలెక్షన్స్ లో నిలబడండి చూద్దాం.. బాలయ్యకి నాగబాబు వార్నింగ్!

మీరేమైనా దిగొచ్చారా..? బాలయ్యపై నాగబాబు మూడో కామెంట్!

మీరేనా సూపర్ స్టార్లు.. బాలయ్యపై విరుచుకుపడ్డ నాగబాబు!

బాలయ్య వర్సెస్ నాగబాబు.. కామెంట్ నెం 1!

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!

బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?