మెగాబ్రదర్ నాగబాబు కొన్ని రోజులుగా బాలయ్యని టార్గెట్ చేస్తూ కౌంటర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు కౌంటర్లను వీడియోల రూపంలో విడుదల చేసిన నాగబాబు ఐదో కౌంటర్ ని కాస్త స్ట్రాంగ్ గానే ఇచ్చాడు.

బాలయ్య ఓ టీవీ చానెల్ లో మాట్లాడుతూ.. " తండ్రి మాతా చార్యుడు , తనయుడు ఆచార్యుడు , తల్లి రామానుజ మతస్థురాలు......... అల్లుడు పింజారి మరదలు మార్వాడి . సంకర పార్టీ ఒక తోక లేదు ఒక తొండం లేదు , అలగా బలగా జనాన్ని వెంటేసుకొని తిరుగుతున్నా పార్టీలన్ని ఇపుడు చూస్తున్నాం మనం..''అని కామెంట్ చేశాడు.

దీనిపై స్పందించిన నాగబాబు.. అలగా బలగా జనం ఏంటి..? ఇతర కులాల మీద జాతుల మీద మీకు గౌరవం లేదు.. మీకు ఏంటి అంత వెటకారం..? అని ప్రశ్నించాడు. 

''ఈ కామెంట్స్ జనసేన పార్టీని టార్గెట్ చేసి అన్నారని మేం అనుకుంటాం మా తమ్ముడిని రాజాకీయంగా ఏమైనా విమర్శించుకోండి నాకు అభ్యంతరం లేదు. కానీ జనసేన పార్టీలో తిరిగే వ్యక్తులు.. ఎస్సీలు, ఎస్టీలు, కాపు వర్గీయులు, బ్రాహ్మణులు, క్షత్రియులు ఇన్ని కమ్యూనిటీలు కలిసి పని చేస్తున్నాయి. మీ తెలుగు దేశం పార్టీలో అయినా, వైఎస్ఆర్ సీపీ ఇలా ఏ పార్టీలో అయినా ఇవే కమ్యునిటీలు ఉంటాయి. మీరు విమర్శించాల్సింది పార్టీ పాలసీలను కానీ వ్యక్తులను, కమ్యునిటీలను కాదు'' అంటూ మండిపడ్డారు. 

''మీరు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారో ఎవరు చెప్పలేదా..? ఎందఱో మనోభావాలు దెబ్బతిన్నాయి. అయినా మేము కామెంట్ చేయలేదు. రాజకీయాల్లో తలదూర్చడం ఎందుకని ఊరుకున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు. 
  

నెక్స్ట్ ఎలెక్షన్స్ లో నిలబడండి చూద్దాం.. బాలయ్యకి నాగబాబు వార్నింగ్!

మీరేమైనా దిగొచ్చారా..? బాలయ్యపై నాగబాబు మూడో కామెంట్!

మీరేనా సూపర్ స్టార్లు.. బాలయ్యపై విరుచుకుపడ్డ నాగబాబు!

బాలయ్య వర్సెస్ నాగబాబు.. కామెంట్ నెం 1!

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!

బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?