మెగా బ్రదర్ నాగబాబు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని అన్నాడు. దీంతో పొలిటికల్, ఫిల్మ్ సర్కిల్స్ ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఈ విషయంపై మిగిలిన మెగాహీరోలు, నందమూరి హీరోలు ఎలా స్పందిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. నాగబాబు, బాలకృష్ణపై కక్ష సాధింపు కోసమే ఈ విధమైన కామెంట్స్ చేశారని తెలుస్తోంది. గడిచిన ఫిబ్రవరి నెలలో బాలకృష్ణ తనకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని అన్నాడు. 2014లో టీడీపీ పార్టీ కోసం ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ అనడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు పది నెలల తరువాత ఇప్పుడు నాగబాబు తన తమ్ముడిపై వేసిన సెటైర్ కి రివెంజ్ తీర్చుకున్నాడు.

నాగబాబు ఈ రకమైన కామెంట్స్ చేసి రాజకీయాల పరంగా అలానే రెండు వర్గాల అభిమానుల మధ్య వార్ కి తెరతీస్తున్నట్లే ఉంది. అయితే ఈ విషయంపై సినీ ఇండస్ట్రీ సభ్యులు స్పందిచే విధంగా కనిపించడం లేదు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. బాలయ్య, నాగబాబు ఎపిసోడ్ పై ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని అనుకుంటున్నారు. 

బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని అన్నప్పుడు స్పందించని సినీజనాలు ఇప్పుడు స్పందిస్తే అదొక గొడవ అవుతుందని కాబట్టి ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉండిపోవాలని భావిస్తున్నారు. మరి రాజకీయాల్లో ఉన్న సినీ తారలు స్పందిస్తారేమో చూడాలి!

పవన్ మూడు పెళ్లిళ్లు.. నాగబాబు ఏం అంటున్నాడంటే..?

పవన్ తో మహేష్ ని పోల్చిన నాగబాబు!

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!