నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ మెగాబ్రదర్ నాగబాబు కౌంటర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కౌంటర్లకు సంబంధించి బాలయ్యకి మీడియా నుండి ఓ ప్రశ్న ఎదురైంది.

'ఎన్టీఆర్' బయోపిక్ విడుదల నేపధ్యంలో తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా థియేటర్లలో ఎన్టీఆర్ విగ్రహాలు పెడతామని అన్నారు.

అనంతరం సినిమా గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ బయోపిక్ తో తండ్రి ఋణం తీర్చుకున్నానని ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ఓ విలేఖరి నాగబాబు ప్రస్తావన తీసుకురాగా.. 'నో కామెంట్' అంటూ బదులిచ్చాడు బాలయ్య.

నాగబాబు అంతగా సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటే బాలయ్య సైలెంట్ గా ఉండడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ పనుల్లో పడి ఈ వివాదాన్ని బాలయ్య పెద్దగా పట్టించుకోవడం లేదని అభిమానులు భావిస్తున్నారు. బహుసా ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా బాలయ్య ఎలాంటి వివాదాల జోలికి వెళ్లే అవకాశాలు లేవని ఆయన సన్నిహితులు అంటున్నారు.  

బాలయ్యపై నాగబాబు కౌంటర్లు.. మధ్యలో వర్మ సెటైర్!

మిగిలినవన్నీ సంకర పార్టీలా..? బాలయ్యపై మండిపడ్డ నాగబాబు!

నెక్స్ట్ ఎలెక్షన్స్ లో నిలబడండి చూద్దాం.. బాలయ్యకి నాగబాబు వార్నింగ్!

మీరేమైనా దిగొచ్చారా..? బాలయ్యపై నాగబాబు మూడో కామెంట్!

మీరేనా సూపర్ స్టార్లు.. బాలయ్యపై విరుచుకుపడ్డ నాగబాబు!

బాలయ్య వర్సెస్ నాగబాబు.. కామెంట్ నెం 1!

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!

బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?