ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణ పలు సంధర్భాల్లో చేసిన కామెంట్స్ కి మెగాబ్రదర్ నాగబాబు వీడియోల రూపంలో కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఐదు కామెంట్లకు కౌంటర్లు ఇచ్చిన నాగబాబు తాజాగా ఆరో కామెంట్ కి వినూత్నంగా కౌంటర్ ఇచ్చాడు.

ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో బాలకృష్ణ ''ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి, లేదా కడుపైనా చేయాలి'' అన్నాడు. ఆ సమయంలో బాలయ్య మాటలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు ఆ కామెంట్స్ ఆధారంగా నాగబాబు ఓ షార్ట్ ఫిల్మ్ ని విడుదల చేశాడు. ఆయన స్వయంగా నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ కి 'ఎర్రోడి వీరగాధ' అనే టైటిల్ పెట్టాడు. ఇందులో ఒక వ్యక్తిని పట్టుకొని మహిళలు అందరూ కొడుతూ ఉంటారు..

అది చూసిన నాగబాబు ఆపాలని అనుకుంటాడు కానీ మనకెందుకులే అని వెళ్ళిపోతాడు.. మళ్లీ అతడినే మరో సెంటర్ దగ్గర కొట్టడం చూసిన నాగబాబు లైట్ తీసుకుంటాడు. ఈసారి ఆ వ్యక్తి నాగబాబు కారుకి అడ్డంగా వచ్చి పడడంతో విషయం ఏంటో తెలుసుకోవాలని కారు దిగిన నాగబాబుతో సదరు వ్యక్తి.. ''ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని పెద్దలు అన్నారు కదా..అని నేను ముద్దు పెట్టడానికి ప్రయత్నించానని'' చెబుతాడు.

దీంతో ఆడవాళ్లను పిలిపించి మరీ అతడిని కొట్టమని సపోర్ట్ చేస్తాడు నాగబాబు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా బాలయ్యని ఎర్రోడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు నాగబాబు. మరి ఈ వీడియో చూసిన నందమూరి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి! 

నాగబాబు కౌంటర్లపై బాలయ్య నో కామెంట్!

బాలయ్యపై నాగబాబు కౌంటర్లు.. మధ్యలో వర్మ సెటైర్!

మిగిలినవన్నీ సంకర పార్టీలా..? బాలయ్యపై మండిపడ్డ నాగబాబు!

నెక్స్ట్ ఎలెక్షన్స్ లో నిలబడండి చూద్దాం.. బాలయ్యకి నాగబాబు వార్నింగ్!

మీరేమైనా దిగొచ్చారా..? బాలయ్యపై నాగబాబు మూడో కామెంట్!

మీరేనా సూపర్ స్టార్లు.. బాలయ్యపై విరుచుకుపడ్డ నాగబాబు!

బాలయ్య వర్సెస్ నాగబాబు.. కామెంట్ నెం 1!

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!

బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?