సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి మెగా బ్రదర్ నాగబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల బాలయ్య ఎవరో తనకు తెలీదంటూ.. ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ వీడియో నెట్టింట బాగా పాపులర్ అయ్యింది కూడా. తాజాగా.. మరోసారి బాలయ్యకి నాగబాబు కౌంటర్ ఇచ్చారు.

ఓ స్కూల్ విద్యార్థి   చక్కగా.. ఏ మాత్రం తడబడకుండా దేశ భక్తి గీతం సారే జహాసే.. అచ్చా పాడిన వీడియోను నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.   బాలయ్యకు కౌంటర్‌గానే నాగబాబు ఈ వీడియో పోస్టు చేసినట్లు స్పష్టంగా అర్థమౌతోంది. ఎందుకంటే.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య సారేజ‌హాసె అచ్చా దేశ భక్తి గీతాన్ని ఖూనీ చేసి న‌వ్వుల‌పాలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది.

బుల్‌బుల్‌ బాలయ్య అంటూ  బాలయ్యను విపరీతంగా ట్రోల్ చేశారు.  దీనికి కౌంటర్‌గానే నాగబాబు ఈ చిన్నపిల్లోడు పాడిన వీడియో పోస్ట్‌ చేశారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే.. మెగా, నందమూరి ఫ్యామిలీలు ఒకటౌతున్నాయనుకున్న సమయంలో.. ఇలా బాలకృష్ణ, నాగబాబు ఒకరిమీద ఒకరు కౌంటర్లు వేసుకోవడం చర్చనీయాంశమైంది.