రీసెంట్ గా బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని కామెంట్ చేసిన నాగబాబు మరోసారి తనదైన శైలిలో చమత్కారాన్ని గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఇది కౌంటర్ అని అందరికి అర్థమైనప్పటికీ నాగబాబు ఏ మాత్రం సందేహించకుండా తన కామెంట్స్ కి మరింత పదును పెంచుతున్నారు

ఇక నిన్నబాలకృష్ణ ఎవరో తెలీదు అని ఫెస్ బుక్ లైవ్ లో పదే పదే చెప్పగా కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుసుకున్న నాగబాబు ఇప్పుడు ఫెస్ బుక్ ద్వారా మరొక వివరణ ఇచ్చారు. బాలకృష్ణ ఎవరో  తెలియదు అనడం నిజంగా నా మిస్టేక్. బాలకృష్ణ గారు అంటే తెలియనివారు ఎవరుంటారు. అయన మంచి నటుడు. ముఖ్యంగా మంచి కమెడియన్. సీన్స్ లలో మంచి హాస్యాన్ని పండించి కడుపుబ్బా నవ్విస్తారు. అలాంటి మంచి కమెడియన్ ని మర్చిపోవడం నిజంగా నా మిస్టేక్ అంటూ.. సీనియర్ కమెడియన్ వల్లూరి బాలకృష్ణ గారి ఫోటో చూపించారు.

అదే విధంగా ఆయన గురించి తెలుసుకోవాలంటే వికీపీడియా లో కూడా చెక్ చేసుకోవచ్చని ఆయన మరణించి చాలా కాలమవుతోందని కానీ ఆయన సినిమాల్లో అందించిన హాస్యం ఇంకా అందరికి కడుపుబ్బా నవ్విస్తాయని ఇలాంటి వ్యక్తి గురించి తెలీదు అనడం నిజంగా తన తప్పని నాగబాబు వివరణ ఇచ్చారు. దీంతో మరోసారి 'బాలయ్య' అనే కామెంట్ సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది.