వివాదాలకు దూరంగా ఉండే నటుడు నాగబాబు ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. నిన్నటి నుండి ఆయన బాలకృష్ణని పరోక్షంగా విమర్శిస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు బాలయ్య పలు సందర్భాల్లో చేసిన రెండు కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చిన నాగబాబు ఇప్పుడు మూడో కామెంట్ పై కౌంటర్ వేశారు.

ఓ ఇంటర్వ్యూలో బాలయ్య ''అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు.. చిరంజీవికి ఏమైంది.. మేము వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు'' అని కామెంట్ చేయగా దీనికి సమాధానంగా నాగబాబు మాట్లాడుతూ.. ''మీరు ఎవరినైనా విమర్శించొచ్చు.. అమితాబ్ బచ్చన్ ఏం పీకాడని మీరు కామెంట్ చేశారు.. స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద స్టారో..అమితాబ్ బచ్చన్ కూడా అంతే.. కన్నడ రాజ్ కుమార్, ఎంజిఆర్ కూడా అంత పెద్ద స్టార్లే.. అలాంటిది మీ తండ్రి వయసున్న అమితాబ్ బచ్చన్ గారిని పట్టుకొని ఏం పీకారని అడిగినప్పుడు నాకు బాధ అనిపించింది'' అంటూ ఎమోషనల్ అయ్యారు.

అదే సందర్భంలో చిరంజీవి ఏమయ్యాడని అడిగారని..  అప్పుడు మా పేరు తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు నాగబాబు. 

''పోనీ తెచ్చారనుకుంటే.. మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరని అన్నారని.. ఏంటి వేరు మీరేమైనా ఆకాశం నుండి దిగి వచ్చారా..? లేకపోతే మీరేమైనా మహారాజా సూర్యవంశీకులా..? మమ్మల్ని అవమానించి మా బ్లడ్ వేరు.. బ్రీడ్ వేరు అంటే మాకు కోపం రాదా..?'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాగబాబు. 

బ్లడ్, బ్రీడ్ అని మనుషులకు చూస్తారా అసలు.. కరెక్టేనా అది..? అని మండిపడ్డ నాగబాబు.. తన అన్నదమ్ములు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ లు వారిపై ఎవరైనా కామెంట్ చేస్తే వదిలేసి వెళ్ళిపోతారే తప్ప రివర్స్ కామెంట్స్ చేయరని.. చరణ్, వరుణ్ లు కూడా వివాదాల జోలికి వెళ్లరని అన్నారు. 

''మీరు దైవాంశసంభూతులు కాదు.. మీరు కూడా మాలాగే మనుషులని'' బాలయ్యకి చురకలు అంటించారు.   

''రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు.. ఎవరైనా సాధించొచ్చు.. ఎవరైనా విన్నింగ్ చేయొచ్చు. సాధారణ ఫ్యామిలీస్ నుండి వచ్చి రాజకీయాల్లో సత్తా చాటిన వారు ఉన్నారు. ఒక్కోసారి మేం ఫెయిల్ అయి ఉండొచ్చు.. అలా అని ఎప్పుడూ ఓడిపోతామని కాదు.. మీ తండ్రిని సొంత బావ వెన్నుపోటు పొడిస్తే ఏం చేశారు మీరు..? ఆయన జీవితాన్ని ఏం చేశారు మీరు.. అప్పుడు ఏమైంది మీ బ్రీడ్, బ్లడ్..'' అంటూ బాలయ్యకి కౌంటర్ ఇచ్చారు. 

 

మీరేనా సూపర్ స్టార్లు.. బాలయ్యపై విరుచుకుపడ్డ నాగబాబు!

బాలయ్య వర్సెస్ నాగబాబు.. కామెంట్ నెం 1!

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!

బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?