ఈరోజు ఉదయం మెగాబ్రదర్ నాగాబాబు కామెంట్ నెంబర్ 1 పేరుతో ఓ వీడియో విడుదల చేశాడు. అందులో పరోక్షంగా బాలకృష్ణని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఇప్పుడు కామెంట్ నెంబర్ 2 పేరుతో మరో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బాలయ్య గతంలో ఓ టీవీ ఛానెల్ లో ''ఒకరిని హీరో చేయడం ఇష్టం లేదు.. మేమే సూపర్ స్టార్స్'' అని కామెంట్ చేశాడు.

దీన్ని పట్టుకున్న నాగబాబు అప్పుడే మేం కౌంటర్ చేసేవాళ్లమని ఎందుకులే అని ఆగామని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ''పవన్ కల్యాణ్ కామెంట్ చేశాడు.. మీ ఒపీనియన్ ఏంటని ఓ చానెల్ వారు ప్రశ్నిస్తే.. అప్పుడు మీరు పవన్ కల్యాణ్ తప్పుగా మాట్లాడారు.. పవన్ కల్యాణ్ కరెక్ట్ గా మాట్లాడలేదని విమర్శించొచ్చు. కానీ మీరు మాకు మేమే హీరోలం.. మేమే సూపర్ స్టార్లం..'' అలా అనడం ఏంటని ప్రశ్నించారు నాగబాబు. 

మీరు సూపర్ స్టార్లే మాకు అందులో అబ్జెక్షన్ లేదని.. కానీ మిగతా వాళ్లు కాదా..? మీరేనా సూపర్ స్టార్లు.. మీరేనా గొప్ప నటులు.. పవన్ కల్యాణ్ కాదా..? అసలు ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి..? మాకు కౌంటర్ చేయడం చేతకాదా..? అంటూ విరుచుకుపడ్డారు. 
 

ఇక్కడ చాలా మంది స్టార్స్ ఉన్నారని నాగబాబు అన్నారు. మీకు సంబంధించిన వారు మాత్రమే స్టార్లు కాదని బాలయ్యని పరోక్షంగా విమర్శించారు. మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, జూనియర్ ఎన్‌టి‌ఆర్, పవన్ కల్యాణ్, మెగాస్టార్ ఇలా చాలా మంది స్టార్లు ఉన్నారని గుర్తుచేశారు. మీరెవరినీ హీరోలు చేయలేదని.. జనాలకు నచ్చితే హీరోలవుతారు.. జనాలు మెచ్చుకుంటే స్టార్లు అవుతారని బాలయ్యకి కౌంటర్ వేశారు. 

 

బాలయ్య వర్సెస్ నాగబాబు.. కామెంట్ నెం 1!

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!

బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?