నందమూరి బాలకృష్ణ పలు సందర్భాల్లో మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ కి కౌంటర్లు ఇస్తున్నాడు నాగబాబు. ఇప్పటికే మూడు కౌంటర్లను వీడియోల రూపంలో విడుదల చేసిన నాగబాబు తాజాగా నాల్గో వీడియోని విడుదల చేశాడు. బాలయ్య చేసిన కామెంట్ ఏంటంటే.. 

''రిపోర్టర్: చిరంజీవిని లేపాక్షి ఉత్సవాలకు పిలిచారా..? 

బాలయ్య: లేదండీ నేనెవడినీ నెత్తిన ఎక్కించుకొని కూర్చోబెట్టుకోను.. నా కష్టార్జితం ఎవరిని పిలవాలో వాళ్లని పిలుస్తా.. రకరలుగా ఉంటారు మనుషులు వచ్చేవాళ్లు పిలిస్తే, నేను నా పద్ధతిలో వెళ్తా.. డిక్టేటర్ పద్ధతిలో ఎవ్వరేమనుకున్నా..''.  

దీనికి కౌంటర్ గా నాగబాబు మాట్లాడుతూ.. ''మీరు లేపాక్షి ఉత్సవాల సందర్భంలో చిరంజీవిని పిలిచారా..? అనే ప్రశ్న ఎదురైనప్పుడు లేదండీ పిలవలేదు.. వేరే పనులు ఉన్నాయని చెబితే సరిపోతుంది కానీ మాకున్న గ్లామర్ చాలు.. వేరేవరినో తీసుకోనని నెత్తిన పెట్టుకోమని అన్నారు కదా.. చిరంజీవి గారు మీకేమైనా ఫోన్ చేసి నన్ను నెత్తిన పెట్టుకోమని చెప్పరా..? లేక మా వాళ్లు కానీ మా ఫ్యాన్స్ కానీ చెప్పారా..? మీ నోటి దురుసుతనం ఏంటి..? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా..?'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాగబాబు. 

''ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి నేను డిక్టేటర్ గా వ్యవహరిస్తానని చెప్పడం ఏంటి..? చూద్దాం నెక్స్ట్ ఎలెక్షన్స్ లో ఏమవుతుందో.. నిలబడండి అదే హిందూపూర్ లో 
ఓ నియంతలా ప్రవర్తిస్తున్నారు కదా..'' అంటూ ఛాలెంజ్ చేశాడు. 

''మా అన్నదమ్ములు శాంతపరులు.. చాలా కోపం, ఆవేశం, బాధ వచ్చేది.. కానీ మేము సంయమనం పాటించాం. మేము ఎప్పుడూ కంట్రోల్ లోనే ఉన్నాం కానీ మీరు లేరు. మీరు అప్పాయింట్ చేసుకొని మీడియాలో మాట్లాడించిన వ్యక్తులు కంట్రోల్ లో లేరు.. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. అయినా మేం కామెంట్ చేయలేదు'' అంటూ స్పష్టం చేశారు.   

మీరేమైనా దిగొచ్చారా..? బాలయ్యపై నాగబాబు మూడో కామెంట్!

మీరేనా సూపర్ స్టార్లు.. బాలయ్యపై విరుచుకుపడ్డ నాగబాబు!

బాలయ్య వర్సెస్ నాగబాబు.. కామెంట్ నెం 1!

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!

బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?