Asianet News TeluguAsianet News Telugu

ఆ రోజు 'మన్మధుడు 2' రిలీజ్ పెట్టుకున్నాడేంటి ? ఫ్యాన్స్ టెన్షన్

సినిమా ప్రొడ్యూసర్ అయినా కొన్ని విషయాలు పట్టించుకోకపోవచ్చేమో కానీ ...ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమాకు సంభందించి ప్రతీ విషయం మీదా రీసెర్చ్ పోగ్రాం పెట్టుకుంటారు. 

Nag's Manmadhudu2 movioe has DISASTER SENTIMENT?
Author
Hyderabad, First Published Jun 17, 2019, 9:40 AM IST

సినిమా ప్రొడ్యూసర్ అయినా కొన్ని విషయాలు పట్టించుకోకపోవచ్చేమో కానీ ...ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమాకు సంభందించి ప్రతీ విషయం మీదా రీసెర్చ్ పోగ్రాం పెట్టుకుంటారు. ఇప్పుడు నాగార్జున్ తాజా చిత్రం మన్మధుడు 2 రిలీజ్ కు సంభందించిన ఓ ఫ్లాఫ్ సెంటిమెంట్ ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. ఆ డేట్ ని మార్చుకోమని సూచిస్తున్నారు. సోషల్ మీడయాలో కొందరు ఈ విషయమై చర్చలు చేస్తున్నారు. 

అందుతున్న సమాచారం మేరకు మన్మధుడు 2 ని  ఆగస్ట్  9 న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. కానీ ఆరోజు నాగార్జున కెరీర్ లో పెద్ద డిజాస్టర్ సినిమా వచ్చింది కాబట్టి దాన్ని ఎవాయిడ్ చెయ్యమంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటీ అంటే నాగ్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన అగ్ని. అయితే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్న తమ సినిమాని ఏ ఫ్లాఫు టచ్ చేయలేదని అలాంటి సెంటిమెంట్స్ అనవసరం అని దర్శక,రనిర్మాతలు భావిస్తున్నారట. 

దాంతో అభిమానులు కొందరు గతంలో ఇలాగే దేవదాసు రిలీజ్ టైమ్ ని గుర్తు చేస్తున్నారు. దేవదాసుని  సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ పెట్టుకోవద్దు ..ఆ రోజు నాగ్ కెరీర్ లో ఫ్లాఫ్ తెచ్చిపెట్టిన బాస్ రిలీజ్ అయ్యింది. కాబట్టి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నారు.   ఈ విషయమై నాగ్ ని మరోసారి ఆలోచించి ప్రకటన చేయమని సలహా ఇస్తున్నారు. 

మన్మధుడు 2 చిత్రం షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని నాగార్జున భావిన్నట్లు సమాచారం.  ‘మన్మథుడు 2’లో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ‘RX 100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.



 

Follow Us:
Download App:
  • android
  • ios