Asianet News TeluguAsianet News Telugu

వర్మ పిచ్చోడు- కీరవాణి

  • గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ విడియో తెరకెక్కించిన వర్మ
  • రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నగ్నంగా నటింటిన పోర్న్ స్టార్ మియా మల్కోవా
  • ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎంఎంక్రీమ్(కీరవాణి)
  • తాజాగా వర్మ పిచ్చోడంటూ కామెంట్స్ చేసిన కీరవాణి
mm keeravani calls rgv a mad guy

వివాదాల కేంద్ర బిందువుగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అనేక విమర్శల నడుమ జనవరి 27న ఉదయం 9 గంటలకు విడుదలైన ఈ వీడియోలో పోర్న్‌స్టార్ మియా మాల్కొవాను 19 నిమిషాల పాటు పూర్తి నగ్నంగా చూపించాడు వర్మ. స్త్రీ లైంగిక స్వేచ్ఛ స్వాతంత్య్రాలను తెలియజేస్తూ.. అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా నిలిచిందీ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’.కాగా ఈ చిత్రానికి సంగీతం అందించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి వర్మ తీసిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’పై ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు.



రామ్ గోపాల్ వర్మతో కలిసి గతంలో చేసిన చిత్రాలను గురించి గుర్తుచేసుకుంటూ... వర్మతో కలిసి 1991లో రొమాన్స్‌కి, 92లో కామెడీకి పనిచేశానని.. ఇప్పడు 2018లో 2018లో సెక్స్‌కు సంగీతం అందించానన్నారు. దీంతో సెల్యులాయిడ్‌పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు నన్నో మెట్టు ఎక్కించాయన్నారు వర్మ. ఇక ఇదే ఏడాదిలో హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతం అందించబోతున్నానన్నారు.



సినిమాలను పిచ్చిగా ప్రేమించే పిచ్చి వర్మ... తనను నమ్మినందుకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు కీరవాణి. ఈయన ట్వీట్‌పై ఆర్జీవీ స్పందిస్తూ.. ‘థాంక్యూ కీరూ’అంటూ రీట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ల సంగతి అటుంచితే ఆర్జీవీ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ మూవీపై ఒక వర్గం ప్రశంసలు కురిపిస్తుంటే.. నిరసనలు జ్వాలలు మాత్రం చల్లారడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios