Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ పై ఫైర్ అయిన సాయి ధరమ్ తేజ్, మెగా హీరోకి అసలు అంత కోపం ఎందుకు వచ్చింది..?

ఎప్పుడూ కామ్ గా కూల్ గా ఉంటాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. పెద్దగా కోప్పడ్డ సందర్భాలు లేవు. కాని ఎందుకో ఒక్క సారిగా ఫైర్ అయ్యాడు సుప్రీం స్టార్. కారణం ఏంటీ..? 

Mega Hero Sai Dharam Tej Fires on Fans
Author
First Published Feb 8, 2023, 10:36 AM IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్... చాలా కూల్ పెద్దగా ఏ విషయాల గురించి పట్టించుకోడు.. విమర్షలను లెక్క చేయడు.. ట్రోల్స్ ను కూడా చూసీ చూడకుండా వదిలేస్తుంటాడు. అసలు ఈ మధ్య పెద్దగా బయట కూడా కనిపించడంలేదు. చాలా  రోజుల తర్వాత సినిమా ఈవెంట్ లో కనిపించాడు సాయి తేజ్. అందరితోనూ ఎంతో స్నేహంగా మెలిగే తేజ్.. చిన్న, పెద్ద ఏ హీరో తమ ఈవెంట్ కి ఆహ్వానించినా వచ్చి.. సపోర్ట్ చేస్తుంటాడు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణుకథ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సాయిధరమ్ తేజ్ స్పెషల్ గెస్ట్ గా వెళ్ళారు. ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేసిన సాయి తేజ్.. ఒక్క సారిగా ఫైర్ అయ్యాడు. 

ట్రైలర్ లాంచ్ తరువాత  సినిమా టీమ్ కి విషెస్ చెబుతూనే.. ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యాడు. సాయి ధరమ్ తేజ్  మాట్లాడుతూ..ఈ సినిమా  ట్రైలర్ చాలా బాగుంది.. కొత్తగా కూడా ఉంది.  ఇదివరకే కిరణ్ నన్ను చాలా ఈవెంట్స్ కు పిలిచాడు. కానీ రాలేకపోయాను. వినరో భాగ్యము విష్ణు కథ టీమ్ కు  నా బెస్ట్ విషెస్ అన్నాడు తేజ్. ఇలా మాట్లాడుతున్న టైమ్ లోనే సాయి తేజ్ ను ఫ్యాన్స్ కాస్త విసిగించారు.  ఆయన మాట్లాడుతండగానే అన్నా పెళ్లి ఎప్పుడు అని అరిచారు. దాంతో సాయి తేజ్ మూడ్ మారిపోయి షాకింగ్ కామెంట్స్ చేశారు. 

 వెంటనే ఫ్యాన్స్ అరుపులకు  రియాక్ట్ అయిన తేజ్..చెప్తా.. మీరెప్పుడైతే అమ్మాయిలను రెస్పెక్ట్ చేస్తారో అప్పుడు.. అది మీ వల్ల అవుద్దా..? అని ఫైర్ అయ్యాడు. అంతటితో ఆగకుండా.. పెళ్లి ఎవ్వడు రా.. ముందు మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. పెళ్లి ఎప్పుడో అయిపోయింది. నాలుగు సార్లు అయ్యింది పెళ్లి  అని  కాస్త ఫన్నీ మూడ్ లోకి వచ్చేశాడు సాయి తేజ్. ప్రస్తుతం తేజ్ ఫైర్ అయిన వీడియో నెట్టింట వైరట్ అవుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios