Asianet News TeluguAsianet News Telugu

‘అన్‌స్టాపబుల్‌’ ప్రోమోలో ఇది గమనించారా? : మ్యాన్షన్ హౌజ్ మ్యాటర్

 బాలయ్య ఫేవరెట్ బ్రాండ్ అదే అని చాలా కాలంగా మీడియాలో  టాక్.అయితే ఇప్పుడు అదే బ్రాండ్ ను ఈ షోకి స్పాన్సర్ గా పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా అన్ స్టాపబుల్ షో ప్రోమోలో మ్యాన్షన్ హౌజ్ కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేసిందనే చెప్పాలి.  

MANSION HOUSE Presents UNSTOPPABLE WITH NBK
Author
Hyderabad, First Published Oct 28, 2021, 9:35 AM IST

పెద్ద తెరపై అదరకొట్టే డైలాగులు చెప్పే బాలకృష్ణ... ఇప్పుడు యాంకర్ గా తనదైన శైలి డైలాగులతో చిన్న తెరపై అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable) అనే పోగ్రామ్ తో హంగామా చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ (Aha)లో ప్రసారంకానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. హోస్ట్‌గా బాలకృష్ణ  దుమ్మురేపబోతున్నరని ఆ ప్రోమో చూస్తే అర్దమవుతోంది.  బాలయ్య మార్క్ డైలాగ్స్ తో ఈ ప్రోమో అదిరిపోయింది.అన్ స్టాపబుల్ ప్రోమోతోనే సూపర్ అనిపించాడు బాలయ్య బాబు.

ఈ షో కాన్సెప్ట్ ఏంటి.గెస్టులు ఎవరు...ఈ టాక్ షో ఎలా నడుస్తుంది అన్న విషయాలు ప్రక్కన పెడితే....ఈ షో స్పాన్సర్ షిప్ కేటగిరిలో ఎవరు ఊహించని విధంగా మ్యాన్షన్ హౌజ్ కనిపించింది. బాలయ్యకు మ్యాన్షన్ హౌజ్ కు సంబంధం ఏంటి అని కొందరకు డౌట్ రావచ్చు. అయితే బాలయ్య ఫేవరెట్ బ్రాండ్ అదే అని చాలా కాలంగా మీడియాలో  టాక్.అయితే ఇప్పుడు అదే బ్రాండ్ ను ఈ షోకి స్పాన్సర్ గా పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా అన్ స్టాపబుల్ షో ప్రోమోలో మ్యాన్షన్ హౌజ్ కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేసిందనే చెప్పాలి. ఇక ప్రోమోలో వెన్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ బాలయ్య మార్క్ గర్జనతో షో మీద ఆసక్తి పెరిగేలా చేశారు.

Also read ‘రొమాంటిక్‌’ సినిమాలో హీరో రామ్,ఎక్కడ కనపడతాడంటే

ఆ ప్రోమోలో బాలకృష్ణ ఎంతో స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు.  ‘నీకు చిత్త శుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్ప శుద్ధి ఉన్నప్పుడు.. నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు.. మాటల్లో ఫిల్టర్‌ ఉండదు.. సరదాలో స్టాప్‌ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. ఒన్స్‌ ఐ స్టెప్‌ ఇన్‌.. దెబ్బకు థింకింగ్‌ మారిపోవాల’ బాలయ్య బాబు చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ప్రోమోతో ఆయన చేయబోయే షో మీద ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయేలా ఉన్నాయి. ఈ షో నవంబర్‌ 4 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. సినీ ప్రముఖుల జీవితాన్ని ఈ షోలో ఆవిష్కరించనున్నారు.

Also read 'ఆర్ఆర్ఆర్': కొత్త లీక్, మ్యాటర్ మామూలుగా లేదుగా

ఇక ఈ టాక్ షోకు గాను బాలయ్య ఎపిసోడ్ కు 40 లక్షల చొప్పున మొత్తం 12 ఎపిసోడ్లకు కలిపి 4.8 కోట్లు తీసుకోవచ్చని అంతర్గతంగా తెలుస్తున్న సమాచారం. దీన్ని ఛారిటీకే వినియోగిస్తారని తెలిసింది. సీజన్ 1 కు వచ్చే రెస్పాన్స్ ని బట్టి దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ఆలోచనలో ఆహా ఉంది.  ఇదే ప్లాట్ ఫార్మ్ లో గతం సమంతా చేసిన ప్రోగ్రాం ఆశించిన రెస్పాన్స్ దక్కించుకోలేదు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios