Asianet News TeluguAsianet News Telugu

'ఆర్ఆర్ఆర్': కొత్త లీక్, మ్యాటర్ మామూలుగా లేదుగా

జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి వచ్చిన ప్రతి అప్ డేట్ ..సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి. తాజాగా ఈ చిత్రం గురించిన తెలిసిన ఓ అప్డేట్ అభిమానులను గాలిలో తేలేలా చేస్తోంది. 

Hollywood studio Warner Bros in talks for RRR
Author
Hyderabad, First Published Oct 28, 2021, 8:35 AM IST

రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా 'ఆర్ఆర్ఆర్' రూపొందుతోన్న సంగతి తెలసిందే. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్ - చరణ్ హీరోలుగా ఈ సినిమా, అందరిలో ఆసక్తిని పెంచుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు, కీరవాణి సంగీతాన్ని అందించారు. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి వచ్చిన ప్రతి అప్ డేట్ .. సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి. తాజాగా ఈ చిత్రం గురించిన తెలిసిన ఓ అప్డేట్ అభిమానులను గాలిలో తేలేలా చేస్తోంది. అదేమిటంటే...

ఈ సినిమా ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేయటానికి ప్రముఖ హాలీవుడ్ సంస్ద వార్నర్ బ్రదర్శ్ సంస్ద ముందుకు వచ్చిందిట. ఈ విషయమై నిర్మాత దానయ్యతోనూ, రాజమౌళి తోనూ చర్చలు జరుపుతున్నారట. ఈ మేరకు ఆ సంస్ద వారు రిలీజ్ స్ట్రాటజీ, ప్రమోషన్ యాక్టివిటీస్ తో కూడిన తమ ప్లాన్ ని రాజమౌళికి పంపారట.  బాహుబలి చిత్రంతో తనేంటో ప్రపంచానికి తెలియచేయటంతో ఈ సినిమాపై అందరి దృష్టీ ఉంది. 

 ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్న అన్ని భాషల్లోనూ ఒకే రోజున ఒకే సమయంలో టీజర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఆల్రెడీ టీజర్ ను కట్ చేయడం జరిగిపోయిందట. అయితే వివిధ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి తగిన డేట్ ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. త్వరలో ఈ డేట్ ను ఖరారు చేయనున్నారు. అజయ్ దేవగణ్ .. అలియా భట్ వంటి బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు, హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో నటించడం విశేషం.

మరో ప్రక్క రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ పై ఫోకస్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉండాలి అని, ఈ రెండు నెలలు ఆర్.ఆర్.ఆర్ గురించే మాట్లాడుకునేలా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. నాలుగైదు సిటీస్ లో ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్స్ నిర్వహించాలని.. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా వేదిక సెట్ చేసినట్లుగా సోషల్ మీడియా టాక్.  

ఆర్.ఆర్.ఆర్ నుండి అల్లూరి, కొమరం భీం టీజర్ తో పాటుగా ఇప్పటి వరకు ఒక్క ప్రమోషనల్ సాంగ్ దోస్తీ సాంగ్ మాత్రమే బయటికి వచ్చింది. ఇక అక్టోబర్ 29 న ఆర్.ఆర్.ఆర్ నుండి బిగ్ అప్ డేట్ ఇస్తారు, ఈ దీపావళికి ఆర్.ఆర్.ఆర్ హీరోస్ స్పెషల్ టీజర్ రాబోతుంది అని ఫాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ రోజు ఉదయం నుండి ఏ క్షణం అయినా ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ రావొచ్చని అంటున్నారు. అన్నట్టుగానే ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ అప్ డేట్ ఇచ్చేసారు. అది అక్టోబర్ 29 న ఆర్.ఆర్.ఆర్ నుండి బిగ్ అప్ డేట్ రాబోతుంది అంటూ ట్వీట్ చేసారు.  

దానితో ఆర్.ఆర్.ఆర్ ఫాన్స్ మరింతగా హుషారెత్తిపోతున్నారు. కొమరం భీం ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ కలిసి సిల్వర్ స్క్రీన్ మీది కనిపించబోతున్నారని, హీరోలపైనే ఆర్.ఆర్.ఆర్ టీజర్ కటింగ్ ఉంటుంది అని, అక్టోబర్ 29 న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ గురించి ఎలాంటి అప్ డేట్ ఇస్తారో అనే క్యూరియాసిటిలో ఫాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడు ఉత్సుకతతో ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios