Asianet News TeluguAsianet News Telugu

‘రొమాంటిక్‌’ సినిమాలో హీరో రామ్,ఎక్కడ కనపడతాడంటే

 ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ వచ్చి రచ్చ చేసారు. అలా జనాల్లోకి ఈ సినిమాకు బాగా వెళ్తోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి మరికొన్ని స్పెషల్ ఎట్రాక్షన్ బయిటకు వస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో హీరో రామ్ , పూరి గెస్ట్ ఎప్పిరియన్స్ లో కనిపిస్తారట.

Hero Ram will be seen as a guest in Romantic movie
Author
Hyderabad, First Published Oct 28, 2021, 8:24 AM IST

ఆకాష్‌ పూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్‌ పాదూరి తెరకెక్కించారు. పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. కేతిక శర్మ హీరోయిన్. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ డోస్ పెంచేసింది టీమ్. ఇప్పటికే ప్రభాస్ తో చేసిన రొమాంటిక్ డేట్ వీడియో వైరల్ అవుతోంది. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ వచ్చి రచ్చ చేసారు. అలా జనాల్లోకి ఈ సినిమాకు బాగా వెళ్తోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి మరికొన్ని స్పెషల్ ఎట్రాక్షన్ బయిటకు వస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో హీరో రామ్ , పూరి గెస్ట్ ఎప్పిరియన్స్ లో కనిపిస్తారట.

 రొమాంటిక్  చిత్రంలో ‘పీనే కే బాద్‌’ అనే పబ్ సాంగ్ వుంది. ఇప్పటికే లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్, భాస్కరభట్ల కలసి రాసిన ఈ పాట లిరిక్స్ క్యాచిగా ఉండటంతో బాగా క్లిక్కైంది. ఈ సాంగ్ స్పెషల్  ఏమిటంటే ..ఈ పాటలో హీరో రామ్ , పూరి కనిపించబోతున్నారట. రామ్ కనిపించడమే కాదు మాస్ స్టెప్పులు కూడా వేస్తాడని  సమాచారం. రామ్ మంచి డ్యాన్సర్. కాబట్టి రామ్ స్టెప్స్ తో  రొమాంటిక్ కి మరో స్పెషల్ ఎట్రాక్షన్ అవుతాయి.

Also read Allu Arjun:థియేటర్ కి వచ్చే అలవాటు జనాల్లో తగ్గింది, 60ఏళ్లలో చూడని దుర్భర పరిస్థితి... బన్నీ కామెంట్స్

ఆకాష్ పూరి మాట్లాడుతూ...‘‘ఇదొక రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. శక్తిమంతమైన పోరాటాలతో పాటు చాలా ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంది. నేనిందులో వాస్కోడిగామా అనే పాత్రలో కనిపిస్తాను. ఈ చిత్రంలో ఊహించని మలుపులేమీ ఉండవు కానీ, కచ్చితంగా సినిమా చూస్తే ఎగ్జైట్‌ అవుతారు. చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు అనే పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. నా వాస్కోడిగామా పాత్ర అందరికీ అలా గుర్తుండిపోతుంది. రమ్యకృష్ణ గారితో పనిచేయడం అదృష్టంగా ఫీలవుతున్నా’’ అన్నారు.

Also read హమీద టాపిక్‌ తీసిన షణ్ముఖ్‌.. మండిపోయిన సిరి.. సారీ చెప్పమంటే గట్టిగా హగ్‌..

 ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘రొమాంటిక్‌’ రెండూ ఒకే సమయంలో జరిగాయి. అయితే ‘ఇస్మార్ట్‌..’ పెద్ద హిట్టవ్వడంతో.. దీన్ని ఇంకా బాగా తీయాలని అనుకున్నాం. అప్పుడే రమ్యకృష్ణ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమె రాకతో సినిమా స్థాయి మారిపోయింది’’ అని చెప్పుకొచ్చారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios