MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది

The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది

నాని నటించిన ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఈ సినిమాకు ట్రైలర్ విడుదల చేయడం లేదని నాని స్పష్టం చేశారు. అసలు ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేయట్లేదో నాని వివరించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 11 2026, 07:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్
Image Credit : Asianet News

సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్

నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్ విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రంగా దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా విడుదల తేదీపై ఆసక్తి పెరిగిపోగా, తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ కీలక విషయాన్ని నాని స్వయంగా వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ట్రైలర్ ఉండదంటూ క్లారిటీ
Image Credit : X

ట్రైలర్ ఉండదంటూ క్లారిటీ

గత కొన్ని రోజులుగా ది ప్యారడైజ్ సినిమాకు ట్రైలర్ విడుదల చేయకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక స్పష్టత రాలేదు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నాని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. నిజంగానే ది ప్యారడైజ్ సినిమాకు ట్రైలర్ విడుదల చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇప్పటివరకు వినిపించిన వార్తలకు తెరపడింది. అయితే ట్రైలర్ విడుదల చేయకపోవడానికి అసలు కారణం ఏంటో కూడా నాని వివరించారు.

Related Articles

Related image1
Chiranjeevi Movies: చిరంజీవి సినిమాల లైనప్ ఇదే..అందరూ సూపర్ హిట్ దర్శకులే, క్యూలో నలుగురు
Related image2
DC Movie: మూవీ సూపర్ హిట్, ముగ్గురికీ బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత.. హీరోయిన్ ని మరచిపోయారా
35
భారీ అంచనాలు ఉన్నా సమయం లేదు
Image Credit : YouTube

భారీ అంచనాలు ఉన్నా సమయం లేదు

సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయని, అందుకే ట్రైలర్ అవసరం లేదని తాము భావించడం లేదని నాని తెలిపారు. అయితే ప్రస్తుతం ట్రైలర్ విడుదల చేయడానికి తగినంత సమయం లేదని చెప్పారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర నాణ్యత కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, సంగీత దర్శకుడు అనిరుధ్‌తో పాటు ఇతర టీమ్ సభ్యులు తీరిక లేకుండా పనిచేస్తున్నారని నాని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ట్రైలర్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం కష్టంగా మారిందని వివరించారు.

45
ట్రైలర్ అదిరిపోయేలా ఉండాలి
Image Credit : others

ట్రైలర్ అదిరిపోయేలా ఉండాలి

ది ప్యారడైజ్కు ట్రైలర్ విడుదల చేస్తే అది సాధారణంగా ఉండకూడదని, అదిరిపోయేలా ఉండాలని నాని అభిప్రాయపడ్డారు. అలాంటి స్థాయిలో ట్రైలర్‌ను సిద్ధం చేయాలంటే కనీసం నాలుగు రోజుల సమయం అవసరం అని చెప్పారు. ప్రస్తుతం ఆ నాలుగు రోజుల సమయాన్ని ట్రైలర్ కోసం కేటాయిస్తే సినిమా తుది పనులపై ప్రభావం పడే అవకాశం ఉందని చిత్రబృందం భావించినట్లు తెలిపారు. అందుకే ట్రైలర్‌ను విడుదల చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు నాని వెల్లడించారు.

55
విడుదలకు ముందు ఆసక్తి మరింత పెరుగుతుందా?
Image Credit : X

విడుదలకు ముందు ఆసక్తి మరింత పెరుగుతుందా?

ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు రానుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా భారీ చిత్రాలకు ట్రైలర్ ద్వారా కథ, పాత్రలు, సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. అయితే ఈ సినిమా విషయంలో చిత్రబృందం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 24న సినిమా నేరుగా థియేటర్లలోకి రానుండటంతో ట్రైలర్ లేకుండా ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు సినిమాకు ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
DC Movie: మూవీ సూపర్ హిట్, ముగ్గురికీ బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత.. హీరోయిన్ ని మరచిపోయారా
Recommended image2
Vijay Ajith Race: లండన్‌లో అరుదైన సీన్.. అజిత్ రేస్‌కు జెండా ఊపనున్న విజయ్..
Recommended image3
Bigg Boss 10: ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి వయసు ఎంత? ఏజ్ లో చిన్న ఎవరు?
Related Stories
Recommended image1
Chiranjeevi Movies: చిరంజీవి సినిమాల లైనప్ ఇదే..అందరూ సూపర్ హిట్ దర్శకులే, క్యూలో నలుగురు
Recommended image2
DC Movie: మూవీ సూపర్ హిట్, ముగ్గురికీ బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత.. హీరోయిన్ ని మరచిపోయారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved