Asianet News TeluguAsianet News Telugu

మనోజ్ చిన్నవాడు, ఆవేశంతో అలా చేశాడు.. గొడవపై స్పందించిన మంచు విష్ణు

శుక్రవారం ఉదయం నుంచి మంచి ఫ్యామిలీలో జరుగుతున్న అంతర్గత వివాదాలు తెరపైకి వచ్చాయి. మంచు విష్ణు గొడవ చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో ఇంటి వివాదం రచ్చకెక్కింది.

Manchu Vishnu reacts on video posted by Manchu manoj dtr
Author
First Published Mar 24, 2023, 2:26 PM IST

శుక్రవారం ఉదయం నుంచి మంచి ఫ్యామిలీలో జరుగుతున్న అంతర్గత వివాదాలు తెరపైకి వచ్చాయి. మంచు విష్ణు గొడవ చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో ఇంటి వివాదం రచ్చకెక్కింది. కుటుంబ పరువు సమస్య కావడంతో వెంటనే మోహన్ బాబు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. 

వీడియో సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించింది. మంచు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఈ గొడవతో బయట పడ్డాయి. ఇటీవల జరిగిన మంచు మనోజ్ వివాహం నుంచే ఈ చర్చ మొదలయింది. మంచు మనోజ్ పెళ్లి.. మోహన్ బాబుకి ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. మంచు విష్ణు కూడా తన తమ్ముడి పెళ్ళికి ఏదో అతిథి వచ్చినట్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. 

తాజాగా జరిగిన గొడవతో మంచు మనోజ్, విష్ణు మధ్య పొసగడం లేదనేది స్పష్టం. మంచు మనోజ్ కి సన్నిహితుడైన సారథి అనే వ్యక్తితో మంచు విష్ణు గొడవ పడుతున్న వీడియో షేర్ చేశారు. వాడేదో అన్నాడు కదా ఒరేయ్ గిరేయ్ అని అంటూ మంచు విష్ణు.. సారథితో గొడవపడుతూ కనిపిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ లో.. ఇదీ పరిస్థితి.. ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారు అండీ మా వాళ్ళని బంధువులని అంటూ మంచు మనోజ్ వాయిస్ వినిపిస్తోంది. 

మంచు సోదరుల వివాదం ఇప్పుడు మీడియాలో సంచలంగా మారింది. మోహన్ బాబు ఇద్దరు కొడుకులని కూర్చోబెట్టి సమస్య పరిష్కరిస్తారా ? అసలు విష్ణుకి , మనోజ్ కి ఎందుకు పొసగడం లేదు అనే చర్చ జరుగుతోంది. ఇంటి పరువు రచ్చకెక్కడంతో మంచు విష్ణు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మంచు మనోజ్ షేర్ చేసిన వీడియోపై విష్ణు తాజాగా స్పదించారు. 'ఇది చాలా చిన్న విషయం. దీనికి ఇంతగా స్పదించాల్సిన అవసరం లేదు. మా ఇద్దరి మధ్య ఇది సాధారణమైన గొడవ. ఇది నిన్న ఉదయం జరిగిన సంఘటన. సారథి వాగ్వాదాన్ని మంచు మనోజ్ అడ్డుకోలేదు. మనోజ్ చిన్న వాడు. ఏదో ఆవేశంలో వీడియో పోస్ట్ చేశాడు' అంటూ మంచు విష్ణు స్పందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios