రూ. 79 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా 13 రోజుల్లో రూ. 75.45 కోట్లు (రూ. 121.30 కోట్ల గ్రాస్) వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఏపీలో ఒక్క ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. 

భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ 2 మార్నింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్  టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు హిందీలో కూడా ఆల్ టైమ్ ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది.  హిందీలో రూ. 336.88  కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ‘దంగల్’ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌కు చేరువలో ఉంది. అయితే తెలుగు,కన్నడంలో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ రాలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. రిలీజై 13 రోజులైనా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరువ కాకపోవటానికి కారణం...ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండటమే అంటున్నారు. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా తెలుగులో రూ. 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 79 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా 13 రోజుల్లో రూ. 75.45 కోట్లు (రూ. 121.30 కోట్ల గ్రాస్) వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఏపీలో ఒక్క ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. 

నైజాం (తెలంగాణ):  రూ. 39.08కోట్లు / రూ. 25కోట్లు

 సీడెడ్ (రాయలసీమ): రూ.  10.54 కోట్లు  /రూ. 14 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ.  6.89 కోట్లు / రూ. 10  కోట్లు

ఈస్ట్: రూ. 5.15 కోట్లు / రూ. 7 కోట్లు

వెస్ట్: రూ. 3.22 కోట్లు రూ. 6 కోట్లు

గుంటూరు: రూ. 4.21 కోట్లు / రూ. 7 కోట్లు

కృష్ణా: రూ. 3.81 కోట్లు / రూ. 6కోట్లు

నెల్లూరు:రూ. 2.55 కోట్లు / రూ. 3 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో రూ. 75.45 కోట్లు షేర్ (రూ. 121.30 కోట్లు గ్రాస్) రాబట్టింది.

అటు ,కర్ణాటకలో బ్రేక్ ఈవెన్‌కు రూ. 16.75 కోట్ల దూరంలో ఉంది. 

మొదటి నాలుగు రోజులు హాలీ డేస్‌ను కేజీఎఫ్ 2 మంచి వసూళ్లను దక్కించుకోవటం కలిసొచ్చింది.  అలాగే పన్నెండో రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే దక్కించుకుంది. ఈ సినిమా 13వ రోజు  తెలుగు రాష్ట్రాలలో రూ. 0.94 కోట్ల షేర్ (రూ. 1.60 కోట్లు) రేంజ్‌లో షేర్‌ను సాధించింది. 

మొత్తంగా రూ. 466.25 కోట్ల షేర్ (రూ. 942.75 కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. 13 రోజుల్లో రూ. 466.25 కోట్ల షేర్ (942.75 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి మరో రికార్డు క్రియేట్ చేసి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.