MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 అరుదైన రికార్డు.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన స్టార్ మా, కారణం ఏంటంటే?

Karthika Deepam 2 అరుదైన రికార్డు.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన స్టార్ మా, కారణం ఏంటంటే?

తెలుగు బుల్లితెర చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన కార్తీకదీపం2 మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. రెండో సీజన్‌గా ప్రసారమవుతున్న ‘కార్తీకదీపం ఇది నవ వసంతం’ ఈ శనివారంతో అద్భుతం చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 21 2026, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు బుల్లితెరపై బ్లాక్ బస్టర్ సీరియల్..
Image Credit : Jio Hotstar

తెలుగు బుల్లితెరపై బ్లాక్ బస్టర్ సీరియల్..

చాలా ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ ఫస్ట్ సీజన్ అద్భుతమైన రెస్పాన్స్ సాధించి.. టాప్ లో నిలిచింది. ఇక సెకండ్ సీజన్ కూడా అంతకు మించిన రెస్పాన్స తో దూసుకుపోతోంది. తాజాగా కార్తీకదీపం సీజన్ 2 సీరియల్ సరికొత్త చరిత్రను సృష్టించింది. తాజాగా 600 ఎపిసోడ్స్ ను కంప్లీట్ చేసుకుంది ఈ సందర్భంగా Star Maa తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారిక ప్రకటన చేస్తూ ప్రత్యేక పోస్టర్, ప్రోమోను విడుదల చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కార్తీకదీపం 600 ఎపిసోడ్స్
Image Credit : social media

కార్తీకదీపం 600 ఎపిసోడ్స్

స్టార్ మా ట్వీట్ లో ఏముందంటే..? “మన మనసుల్లో చెరగని ముద్ర వేసిన కార్తీకదీపం 600 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు” అంటూ స్టార్ మా పోస్ట్ చేసింది. మరో ప్రోమోలో “600 ఎపిసోడ్స్, చిరస్మరణీయమైన ప్రేమ.. ఈ అందమైన ప్రయాణానికి తోడైన అభిమానులందరికీ కృతజ్ఞతలు” అంటూ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపింది.

600 ఎపిసోడ్స్, చిరస్మరణీయమైన ప్రేమ 💖
మన మనసుల్లో నిలిచిన #KarthikaDeepam టీమ్‌కి శుభాకాంక్షలు ✨
ఈ అందమైన ప్రయాణానికి తోడైన అభిమానులందరికీ ధన్యవాదాలు 🌸#600EpisodesOfKarthikadeepam

Watch #KarthikaDeepam Mon to Sat at 8 PM only on #StarMaa pic.twitter.com/Z3nsfmiB1T

— Starmaa (@StarMaa) February 21, 2026

35
కార్తీకదీపం2 ఇది నవ వసంతం
Image Credit : JIo Hotstar

కార్తీకదీపం2 ఇది నవ వసంతం

సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ను ఓటీటీ లో Jio Hotstar లో కాస్త ముదుగానే చూసే అవకాశం ఉంది. కార్తీకదీపం తొలి సీజన్ 1500కు పైగా ఎపిసోడ్లతో తెలుగు టెలివిజన్ చరిత్రలో రికార్డు సృష్టించింది. వంటలక్క (దీప) – డాక్టర్ బాబు (కార్తీక్) జంట ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. ఆ జోడీని మళ్లీ తెరపై చూడాలనుకున్న అభిమానుల కోరిక మేరకు రూపొందిన సీజన్2 ‘ఇది నవ వసంతం’ కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతోంది.

45
టాప్ టీఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్..
Image Credit : JIo Hotstar

టాప్ టీఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్..

ప్రస్తుతం ఈ సీరియల్ స్టార్ మాలో టాప్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. కుటుంబ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. 600వ ఎపిసోడ్ కథలో కీలక మలుపుగా నిలిచింది. సుమిత్ర అసలు కూతురు జ్యోత్స్న కాదు, దీప అనే నిజం దశరథకు తెలిసిపోవడం కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. పారిజాతం చేసిన పసిబిడ్డల మార్పిడి గుట్టు రట్టవడంతో కుటుంబ సంబంధాలు కుదేలయ్యాయి. తల్లి సుమిత్ర ప్రాణాలను కాపాడటానికి దీప తన గర్భంలోని బిడ్డను పణంగా పెట్టే క్లిష్ట పరిస్థితుల్లో పడింది.

55
కార్తీకదీపం 2 లో పాత్రలు ఇవే..?
Image Credit : JIoHotstar

కార్తీకదీపం 2 లో పాత్రలు ఇవే..?

ఈ సీరియల్‌లో కార్తీక్ బాబు పాత్రలో నిరుపం పరిటాల, దీప గా ప్రేమి విశ్వనాథ్, జ్యోత్స్నగా ప్రియాంక, దశరథగా సుభాష్, పారిజాతం పాత్రలో సుమిత్ర నటిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమి విశ్వనాథ్ మళ్లీ దీప పాత్రలోకి రావడం ఈ సీజన్ విజయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మొదటి సీజన్‌లో మోనిత పాత్ర ఎంతటి విలనీని పండించిందో, ఈ సీజన్‌లో జ్యోత్స్న పాత్ర అదే స్థాయిలో ప్రతికూల ఛాయలను తెరపై ఆవిష్కరిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
ఈ క్యూట్ పాప 1000 కోట్ల హీరోయిన్, 15 హిట్లు కొట్టింది..పెళ్లి పీటలెక్కబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా?
Recommended image2
Meena : రెండో పెళ్లిపై మీనా సంచలన కామెంట్స్, ధనుష్ తో వచ్చిన వార్తలపై క్లారిటీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved