MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Hey Balwanth Collections: `హే బలవంత్‌` మూవీకి అదిరిపోయే వసూళ్లు.. సుహాస్‌ పంట పండినట్టే

Hey Balwanth Collections: `హే బలవంత్‌` మూవీకి అదిరిపోయే వసూళ్లు.. సుహాస్‌ పంట పండినట్టే

సుహాస్‌, శివానీ నగరం జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `హే బలవంత్‌`. ఈ మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రానికి మొదటి కలెక్షన్లు ఎంతనేది చూస్తే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 21 2026, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హే బలవంత్‌ మూవీకి పాజిటివ్‌ టాక్‌
Image Credit : Asianet News

హే బలవంత్‌ మూవీకి పాజిటివ్‌ టాక్‌

సుహాస్‌ హీరోగా, శివానీ నగరం హీరోయిన్‌గా నటించిన చిత్రం `హే బలవంత్‌`. గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీకే నరేష్‌, సుదర్శన్‌, వెన్నెల కిశోర్‌, అజయ్‌ ఘోష్‌, యాంకర్‌ స్రవంతి, హర్షవర్థన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. బీ నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ మూవీని వంశీ నందిపాటి రిలీజ్‌ చేశారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. మంచి రివ్యూస్‌ వచ్చాయి.

24
హే బలవంత్‌ మూవీకి మొదటి రోజు కలెక్షన్లు
Image Credit : Asianet News

హే బలవంత్‌ మూవీకి మొదటి రోజు కలెక్షన్లు

ఇక థియేట్రికల్‌గానూ ఈ మూవీ సత్తా చాటుతోంది. ఫస్ట్ డే మంచి వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రానికి మొదటి రోజు కలెక్షన్ల రిపోర్ట్‌ వచ్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.2.14కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ విషయాన్ని టీమ్‌ వెల్లడించింది. చిత్ర బృందం ఈ స్థాయిలో వసూళ్లని అంచనా వేయలేదు. వారు ఊహించిన దానికంటే ఎక్కువగానే వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి ఈ వసూళ్లు వచ్చాయి.

Related Articles

Related image1
OTT Movies: ఒకే రోజు ఓటీటీలోకి 46 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. తెలుగు మూవీస్‌ ఇవే
Related image2
Hey Balwanth Movie Review: హే బల్‌వంత్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుహాస్‌, వీకే నరేష్‌ మూవీ ఎలా ఉందంటే?
34
హే బలవంత్‌ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌
Image Credit : Asianet News

హే బలవంత్‌ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఈ వసూళ్లు పెరిగే అవకాశం ఉందట. టీమ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. రెండో రోజు మరింత స్ట్రాంగ్‌గా ఉందని తెలిపింది. ఇదే జరిగితే ఈ మూవీకి నెమ్మదిగా పుంజుకోబోతుందని చెప్పొచ్చు. శనివారం, ఆదివారం కలెక్షన్లు పెరిగితే మొదటి వీకెండ్‌లోనే బ్రేక్‌ ఈవెన్‌లో సగం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి ఎనిమిది కోట్ల బిజినెస్‌ అయ్యిందని సమాచారం. అంటే సుమారు రూ.15-16కోట్ల గ్రాస్‌ వస్తే సినిమా సేఫ్‌ అని చెప్పొచ్చు. ఆ టార్గెట్‌ పెద్దదే, కానీ ఇదే జోరు చూస్తుంటే, దాన్ని రీచ్‌ కావడం పెద్ద కష్టమేమీ కాదని టాక్‌.

44
నవ్విస్తూ గుండెని బరువెక్కించే హే బలవంత్‌ మూవీ
Image Credit : Asianet News

నవ్విస్తూ గుండెని బరువెక్కించే హే బలవంత్‌ మూవీ

కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం డిజిటల్‌ రైట్స్ కూడా బాగానే అమ్ముడుపోయినట్టు సమాచారం. జీ5 ఈ రైట్స్ ని దక్కించుకుంది. శాటిలైట్‌ రైట్స్ కూడా అదే సొంతం చేసుకుంది. ఈ మూవీని వంశీనందిపాటి విడుదల చేసిన విషయం తెలిసిందే. కంటెంట్‌పై నమ్మకంతో దీన్ని ఆయన విడుదల చేసేందుకు ముందుకు వచ్చినట్టు టాక్‌. ఇక ఈ మూవీ ఆద్యంతం కామెడీగా సాగుతూనే చివర్లో ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. ప్రాస్టిట్యూషన్‌ తప్పు కాదని, అలా చేసేవారి జీవితంలోని పెయిన్‌ని, వారి గొప్పతనాన్ని తెలియజేసే మూవీ ఇది.. నవ్విస్తూ, గుండెని బరువెక్కించింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra : పెళ్లికి ముందు డేటింగ్ చేసిన హీరోల సీక్రెట్స్ వెల్లడించిన ప్రియాంక చోప్రా, ఏం చెప్పిందంటే?
Recommended image2
రామ్ చరణ్ కి టీనేజ్ లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? మెగా మదర్ సురేఖ వెల్లడించిన టాప్ సీక్రెట్ ..?
Recommended image3
OTT Movies: ఒకే రోజు ఓటీటీలోకి 46 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. తెలుగు మూవీస్‌ ఇవే
Related Stories
Recommended image1
OTT Movies: ఒకే రోజు ఓటీటీలోకి 46 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. తెలుగు మూవీస్‌ ఇవే
Recommended image2
Hey Balwanth Movie Review: హే బల్‌వంత్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుహాస్‌, వీకే నరేష్‌ మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved