Asianet News TeluguAsianet News Telugu

నందమూరి కళ్యాణ్‌రామ్‌ - తమన్నాల చిత్రం టైటిల్  "నా.. నువ్వే"

  • కల్యాణ్ రామ్ తమన్నా జోడీగా నటిస్తున్న చిత్రం టైటిల్ ఖరారు
  • నా నువ్వే... అనే టైటిల్ ఖరారు చేసిన చిత్ర యూనిట్
  • ఈస్ట్  కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో, కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మా ణంలో తెరకెక్కిన మూవీ

 

kalyan ram tamannah movie title confirmed as naa nuvve

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "నా.. నువ్వే"  అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు నేడు చిత్ర బృందం అధికారికం గా ప్రకటించింది. 

కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణం లో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణ లో  ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రఖ్యాత కెమరామెన్ పి. సి. శ్రీరామ్ ఈ చిత్రానికి అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఒక టోటల్ ఫ్రెష్ లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రం లో కనిపిస్తారు. ఈ చిత్రానికి అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ షరెత్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

"జనవరి నెలాఖరు కి దాదాపు గా షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి "నా.. నువ్వే" అనే టైటిల్ చాలా అప్ట్ గా ఉంటుంది. ఒక నూతన కాన్సెప్ట్ తో, ఫ్రెష్ లుక్ తో ఈ చిత్రాన్ని దర్శకులు జయేంద్ర గారు తీర్చిదిద్దుతున్నారు. కళ్యాణ్ రామ్, తమన్నా ల కాంబినేషన్ ఈ చిత్రానికే హై లైట్ గా నిలుస్తుంది.  పి. సి. శ్రీరామ్ గారి కెమెరా వర్క్  "నా.. నువ్వే" చిత్రానికి చాలా పెద్ద అసెట్ " అని నిర్మాత ల లో ఒకరైన కిరణ్ ముప్పవరపు తెలిపారు. 

"పి. సి. శ్రీరామ్, జయేంద్ర వంటి టాప్ క్వాలిటీ టెక్నికల్ టీం తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. హీరో కళ్యాణ్ రామ్ గారి కి ఈ చిత్రం ఒక టోటల్ మేకోవర్ ని ఇస్తుంది అని నమ్ముతున్నాం. వేసవి సెలవుల్లో చిత్రాన్ని విడుదల చేయటానికి సిద్ధపడుతున్నాం" అని సమర్పకులు మహేష్ కోనేరు తెలిపారు. 

లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా గా ఉండే ఈ చిత్రం లో, కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖ వాణి  ప్రధాన నటులు. ఇతర నటీ నటులు వివరాలు త్వరలో తెలుపుతాము అని యూనిట్ సభ్యులు తెలిపారు.

 

ఈ చిత్రానికి నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు ,  సంగీతం: షరెత్ , సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్ ,ఎడిటింగ్‌: టి. ఎస్. సురేష్ , కథ, స్క్రీన్‌ప్లే - జయేంద్ర, శుభ,  దర్శకత్వం:  జయేంద్ర 

Follow Us:
Download App:
  • android
  • ios