Asianet News TeluguAsianet News Telugu

హైాకోర్టులో నితిన్ కు ఊరట, క్రిమినల్ కేసు కొట్టివేత

  • హైాకోర్టులో నితిన్ కు ఊరట, క్రిమినల్ కేసు కొట్టివేత
  • గతంలో నితిన్ రూ.50 లక్షలు తీసుకుని మోసం చేశారని కేసువేసిన సత్యనారాయణ
  • సివిల్ మేటర్ లో క్రిమినల్ కేసు వేయటం సరికాదన్న నితిన్ లాయర్ వాదనను అంగీకరించిన కోర్టు
  • నితిన్, అతని సోదరి నిఖితారెడ్డిపై కేసు కొట్టివేసిన హైకోర్టు
high court dismisses case against nithin and nikhitareddy

తనకు సినిమా హక్కులు ఇప్పిస్తామంటూ రూ.50 లక్షలు అడ్వాన్స్ తీసుకుని హక్కులు ఇవ్వకుండా మోసం చేశారని సినీ హీరో నితిన్, ఆయన సోదరి నిఖితారెడ్డిలపై ఫిర్యాదు చేసిన సత్యనారాయణ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చటంతో నితిన్, నిఖితారెడ్డిలకు ఊరట లభించింది. నితిన్, నిఖితా రెడ్డిలపై మల్కాజిగిరి కోర్టులో ఉన్న క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. కేసును కొట్టివేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు వెలువరించింది.

 

అఖిల్‌ సినిమాకు సంబంధించిన హక్కులు ఇస్తామంటూ రూ.50 లక్షలు తీసుకుని, ఆ తర్వాత ఇవ్వకుండా మోసం చేశారని సికింద్రాబాద్‌కు చెందిన జి సత్యనారాయణ మల్కాజిగిరి కోర్టులో ఫిర్యాదు చేశారు. నితిన్, నిఖితా రెడ్డిలు నిందితులుగా ఇందులో నితిన్‌తో పాటు ఆయన సోదరి నిఖితా రెడ్డి, తండ్రి సుధాకర్ రెడ్డిలను, శ్రేష్ఠ్‌ మూవీస్‌ను నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన ఇరవయ్యవ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది.

 

అయితే, ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ నితిన్‌, నిఖితా రెడ్డి తదితరులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారం చెక్కులకు సంబంధించిన సివిల్‌ వివాదమని, క్రిమినల్‌ కేసు పెట్టడం సరికాదన్నారు. శ్రేష్ట మూవీస్ సంస్థలో నితిన్, నిఖితా రెడ్డిలు భాగస్వాములంటూ తప్పుగా పేర్కొని ఫిర్యాదు చేశారని, అందులో వారు భాగస్వాములు కాదని న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ వాదనను ఆమోదించిన హైకోర్టు కేసును కొట్టివేసింది.

 

సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురికి చెందిన సత్యనారాయణ 2017 సెప్టెంబర్ నెలలో ఈ కేసు వేశారు. శ్రేష్ట మూవీస్‌ను మొదటి, సుధాకర్ రెడ్డిని రెండు, నితిన్, నిఖితలను మూడు, నాలుగో నిందితులుగా పేర్కొన్నారు. తాజాగా కేసును హైకోర్టు కొట్టివేయడంతో నితిన్, నిఖితారెడ్డలకు ఊరట లభించినట్లయింది.

Follow Us:
Download App:
  • android
  • ios