Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న హీరో సూర్య... ధర అన్ని కోట్లా?


హీరో సూర్య ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొన్నారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇక దాని ధర మరింత ఆసక్తి రేపుతోంది. 
 

crazy buzz hero suriya owns a luxury house in Mumbai
Author
First Published Mar 20, 2023, 7:34 PM IST

కోలీవుడ్ నటుడు సూర్యకు తెలుగులో కూడా మార్కెట్ ఉంది. ఆయన చిత్రాలు టాలీవుడ్ ఆడియన్స్ ఎగబడి చూస్తారు. అందుకే సూర్య ప్రతి చిత్రం తమిళనాడులో మాదిరి తెలుగు రాష్ట్రాల్లో అదే స్థాయిలో విడుదల చేస్తారు. ఒక పక్క కమర్షియల్ చిత్రాలు చేస్తూనే జై భీమ్ వంటి సోషల్ మెసేజ్ చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. సూరారై పోట్రు మూవీలో నటనకు గానూ సూర్య నేషనల్ అవార్డు అందుకున్నారు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జీఆర్ గోపినాధ్ జీవితకథ ఆధారంగా సూరారై పోట్రు తెరకెక్కింది. తెలుగులో ఆకాశం నీ హద్దురా టైటిల్ తో విడుదల చేశారు. సుధా కొంగర తెరకెక్కించిన ఈ  చిత్రం అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదలైంది. 

ప్రస్తుతం భారీ చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని నిర్మాతగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. కాగా సూర్య ఫ్యామిలీతో సహా ముంబైకి షిఫ్ట్ అవుతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఆయన రూ. 70 కోట్లతో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారట. ముంబైలో ప్రముఖులు నివసించే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ ఉందట. 

గార్డెన్ ఏరియా, పార్కింగ్, స్విమ్మింగ్ పూల్, జిమ్. లైబ్రరీ, థియేటర్ ఇలా అన్ని ఆధునిక హంగులు కలిగి ఉన్న ఈ ఇంటి కోసం సూర్య అంత మొత్తం వెచ్చించారట. ఈ మేరకు సమాచారం అందుతుంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. హీరోయిన్ జ్యోతికను సూర్య 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అమ్మాయి, అబ్బాయి సంతానం. ఒక చారిటీ సంస్థ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios