Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ నటుడి భార్య కంత్రీ పనులు, వారితో బెడ్ పై నగ్నంగా.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు

బాలీవుడ్ కి చెందిన ఓ నటుడి భార్య హానీ ట్రాప్ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడింది. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Bollywood Actor Wife Lubna Wazir arrested in Honey Trap Case
Author
Hyderabad, First Published Nov 22, 2021, 11:53 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలీవుడ్ కి చెందిన ఓ నటుడి భార్య హానీ ట్రాప్ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడింది. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హానీ ట్రాప్ నిర్వహిస్తున్న ఆమె పేరు స్వప్న అలియాస్ Lubna Wazir. 90 దశకంలో బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఓ నటుడి భార్య ఆమె. 

స్వప్న 2016 నుంచి honey trap లో భాగంగా అనేక అక్రమాలు చేస్తోంది. ఆమెకు ఇద్దరు మగ మోడల్స్ కొంతమంది అందమైన ఫిమేల్ మోడల్స్ సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు స్వప్న తన గ్యాంగ్ తో చాలా మంది పారిశ్రామిక వేత్తలని ట్రాప్ లోకి దించి వారి నుంచి భారీగా నగదు దోచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 

దీనితో ఆమె నివాసంలో పోలీసులు రైడ్ నిర్వహించగా రూ 29 లక్షల నగదుతో పాటు 7 మొబైల్ ఫోన్లు, 2 కార్లు, 8 లక్షల విలువైన బంగారు ఆభరణాలు లభించాయి. పోలీసులు వాటిని సీజ్ చేశారు. స్వప్న తన గ్యాంగ్ తో ఒక ప్లాన్ ప్రకారం హానీ ట్రాప్ చేస్తూ సంపన్నులని టార్గెట్ చేస్తున్నట్లు తేలింది. దీనికోసం గోవాలో కిట్టి పార్టీలు కూడా నిర్వహించింది. అలాగే ముంబైలో జుహు, బాంద్రా లాంటి సంపన్నులు ఉండే ప్రాంతాల్లో కూడా స్కెచ్ వేసింది. 

కిట్టి పార్టీలలో సంపన్నులతో పరిచయాలు పెంచుకుంటుంది. ఆ తర్వాత బిజినెస్ డీల్స్ పేరుతో వారిని ఉచ్చులోకి లాగుతుంది. ఆమె ప్లాన్ కు కొందరు మగ మోడల్స్, కొందరు ఫిమేల్ మోడల్స్ సహకరిస్తున్నారు. నెమ్మదిగా వ్యాపారవేత్తలకు ఉచ్చు బిగించాక వారిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. చాలా మంది పరువు పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. కానీ ఓ వ్యాపార వేత్త మాత్రం వారి వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఎలా ఈ ఉచ్చులో చిక్కున్నాను అనే విషయాలని పోలీసులకు వివరించారు. 

Also Read: రుహాని శర్మ హాట్ నెస్ నెక్స్ట్ లెవల్.. ఇలా అయితే కుర్రాళ్లు ఏమైపోవాలి..

మొదట ఇద్దరు అమ్మాయిలు బిజినెస్ డీల్ సాకుతో వ్యాపారవేత్తని ఫైవ్ స్టార్ హోటల్ లో కలుస్తారు. సరదాగా మాటలు చెబుతూ పరిచయం పెంచుకుంటారు. ఇంతలో ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి తన కోసం బయట ఎవరో వెయిట్ చేస్తున్నారని వెళ్ళిపోతుంది. మరో అమ్మాయి వాష్ రూమ్ కి వెళ్లి నగ్నంగా మారుతుంది. ఇంతలో వీరి గ్యాంగ్ లోని ఓ వ్యక్తి రూమ్ డోర్ కొడతారు. నగ్నంగా ఉన్న అమ్మాయే డోర్ ఓపెన్ చేస్తుంది. యితడు తనని అత్యాచారం చేశాడని బెడ్ పై పడుకుని ఏడుస్తూ నాటకాలు ఆడుతుంది. అప్పుడే రూమ్ లోకి వచ్చిన వ్యక్తి వ్యాపారవేత్తతో కలిపి ఇద్దరినీ ఫోటోలు వీడియోలు తీస్తాడు. 

Also Read: అబ్బురపరిచే సెట్ లో సమంత అందాల విందు.. ఐటమ్ సాంగ్ లో నెవర్ బిఫోర్ అనిపించేలా

సదరు వ్యాపార వేత్త ఏం జరుగుతోంది అని తేరుకునేలోపే మొత్తం జరిగిపోతుంది. ఇక ఆ ఫోటోలు వీడియోలతో వ్యాపారవేత్తని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. ఈ క్రైమ్ నిర్వహించే కంత్రి లేడి స్వప్నని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఇన్వాల్ ఐన మోడల్స్ కోసం గాలిస్తున్నారు. వీరి బారిన పడి మోసపోయిన మిగిలిన వ్యాపారవేత్తల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios