Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: కౌశల్ గురించి మీకెందుకు..? గీతాపై నాని ఫైర్!

బిగ్ బాస్ సీజన్ 2 లో కొన్ని రోజులుగా కౌశల్, గీతామాధురికి పొసగడం లేదన్న సంగతి తెలిసిందే. కౌశల్ ని సీజన్ మొత్తం నామినేట్ చేసిన గీతామాధురి బయట అతడికి ఉన్న ఫాలోయింగ్ గురించి దీప్తి, సామ్రాట్ ల వద్ద చర్చించింది.

bigg boss2: geetha madhuri comments on kaushal
Author
Hyderabad, First Published Sep 16, 2018, 12:13 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 లో కొన్ని రోజులుగా కౌశల్, గీతామాధురికి పొసగడం లేదన్న సంగతి తెలిసిందే. కౌశల్ ని సీజన్ మొత్తం నామినేట్ చేసిన గీతామాధురి బయట అతడికి ఉన్న ఫాలోయింగ్ గురించి దీప్తి, సామ్రాట్ ల వద్ద చర్చించింది. ఈ గేమ్ కి వచ్చేముందే అంతా సెట్ చేసుకొని వచ్చారంటూ గీతామాధురి.. కౌశల్ పై చేసిన స్టేట్మెంట్ పై నాని ఆమెని ప్రశ్నించారు.

దానికి సమాధానంగా.. ''నాకు కౌశల్ కి వస్తోన్న పాపులారిటీ గురించి తెలిసాక ఇదంతా సెట్టింగ్ లో భాగమేనని అనిపించింది. నాకొచ్చిన డౌట్ ని నూతన్ నాయుడిని అడిగా.. ఆయన అవును అన్నట్లుగా సమాధానం చెప్పారు. దాంతో నేనొక అంచనాకు వచ్చాను'' అంటూ చెప్పగా.. మీరు ఇచ్చే స్టేట్మెంట్ వల్ల ప్రేక్షకులకు రాంగ్ మెసేజ్ వెళ్తుందని నాని అన్నారు.

కౌశల్ అయితే తనకు ఈ విషయానికి సంబంధించి ఏం తెలియదని.. తను బిగ్ బాస్ లో ఎంపిక అయినట్లు కూడా షో కి వచ్చే పది రోజుల ముందే తెలిసిందని తనేం సెట్ చేసుకొని రాలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.   

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: నువ్వు డిజాస్టర్ కౌశల్.. నాని కామెంట్స్!

బిగ్ బాస్2: తోటి హౌస్ మేట్ ని తక్కువ చేస్తావా..? కౌశల్ కి నాని పంచ్..!

బిగ్ బాస్2: ఎలిమినేషన్ లో అమిత్ అవుట్!

Follow Us:
Download App:
  • android
  • ios