బిగ్ బాస్ సీజన్ 2 శనివారం ఎపిసోడ్ లో నాని ఎప్పటిలానే గ్రాండ్ ఇచ్చేశారు. హౌస్ మేట్స్ లో రోల్, కౌశల్ కి ముందుగా క్లాస్ తీసుకున్న నాని ఆ తరువాత కౌశల్ పై అసహనం వ్యక్తం చేశారు. రోల్ ని కౌశల్ అసభ్యకరంగా మాట్లాడడంపై ప్రశ్నించిన నాని.. 'నువ్వు అన్నట్లు రోల్ గనుక నిన్ను అంటే హౌస్ లో పరిస్థితులు మరో విధంగా ఉండేవి' అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు నాని.

ఇక కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుతూ.. టాస్క్ ఒక డిజాస్టర్ అంటూ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ని సరిగ్గా అర్ధం చేసుకోకుండా గేమ్ ఆడారని హౌస్ మేట్స్ కి మరోసారి కెప్టెన్సీ టాస్క్ రూల్స్ ని చదివి వినిపించారు నాని. సంచాలకుడిగా కౌశల్ సొంత రూల్స్ పెట్టడం, బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో చివరి వరకు గ్లాస్ ఎవరి చేతిలో ఉందంటే కౌశల్.. రోల్ పేరు చెప్పకపోవడం పట్ల నాని అతడిని ప్రశ్నించారు. 

ఎవరూ కెప్టెన్ అవ్వకూడదని అందరూ భావించడం కరెక్ట్ కాదని, అందరికి అభద్రతాభావం ఎక్కువవుతుందని అన్నారు నాని. ఇక సంచాలకుడిగా నువ్వు డిజాస్టర్ కౌశల్ అంటూ నాని కామెంట్స్ చేశారు.