Asianet News TeluguAsianet News Telugu

ఆరాధ్య అనే పేరుతో నాకు సోదరి ఎవరూ లేరంటున్న అంజలి

  • రీసెంట్ గా అంజలి సిస్టర్ అంటూ సినిమాల్లో కి వస్తున్నానంటూ ఆరాధ్య ప్రచారం
  • అంజలి సోదరి ఆరాధ్యనని, అమ్మ కూడా అక్కకు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందన్న అరాధ్య
  • ఆరాధ్య అనే పేరుతో నాకు సోదరి ఎవరూ లేరంటున్న అంజలి
anjali tweet about sister aradhya creating news in social media

తెలుగమ్మాయి అంజలి తొలుత తెలుగు సినిమాలతో కథానాయికగా పరిచయమై.. ఆపై తమిళంలో మంచి పేరు సంపాదించి మంచి స్థాయికి ఎదిగింది. ప్రస్థుతం ఒకట్రెండు ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న అంజలి తన కెరీర్ ప్రస్థుతం అప్స్ అండ్ డౌన్స్ లో వుండటంతో పెద్దగా వార్తల్లో కనిపించట్లేదు. అయితే హీరోయిన్‌గా అంజలి చెల్లెలంటూ  సోషల్ మీడియాలో ఓ అమ్మాయి హల్ చల్ చేస్తోంది.

 

ఆ అమ్మాయి పేరు ఆరాధ్య. ఆమె చేసిన ఒక ఫొటో షూట్ హాట్ టాపిక్ అయింది. కొంచెం అంజలి పోలికలతోనే ఉండటంతో తన గురించి మీడియాలో బాగానే చర్చ నడిచింది. తాను ఇప్పటికే తమిళ సినిమాల్లో నటిస్తున్నానని.. తెలుగులోనూ సినిమా చేయబోతున్నానని చెబుతూ అంజలి పేరు కూడా ప్రస్తావించింది ఈ ఆరాధ్య.
 

అయితే ఇప్పుడు అంజలి లైన్లోకి వచ్చి ఆరాధ్య తన చెల్లెలే కాదంటోంది. తనకు ఒక అక్కమాత్రమే వుందంటోంది. నేరుగా ఆ విషయం చెప్పలేదు కానీ.. ఆరాధ్య తన చెల్లెలు కాదంటూ తన మేనేజర్ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్ చేసింది అంజలి. ‘‘అంజలి చెల్లెలు సినిమాల్లోకి వస్తోందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆమెకు ఒక అక్క మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితం గడుపుతోంది’’ అని అంజలి మేనేజర్ రియాజ్ అహ్మద్ ట్విట్టర్లో తెలియజేశాడు. 


దీన్ని అంజలి రీట్వీట్ చేయడాన్ని బట్టి ఆరాధ్య తన చెల్లెలు కానే కాదని అంటున్నట్లు మనకు అర్థమవుతుంది. దీంతో అంజలి చెల్లెలు కాకపోయినా.. ఆమె పేరును ఆరాధ్య ఎలా వాడుకుంటోందన్నది చర్చనీయాంశంగా మారింది. అంజలికి ఆమె కుటుంబ సభ్యులతో గొడవలున్న నేపథ్యంలో దీని వెనుక మతలబేంటో జనాలకు అర్థం కావడం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios