Asianet News TeluguAsianet News Telugu

నగ్నంగా అల్లరి నరేష్‌.. నాంది `ఎఫ్‌ ఐ ఆర్‌`!

క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న 'నాంది' అనే విల‌క్ష‌ణ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు నరేష్‌. స్టార్ డైరెక్ట‌ర్‌ హ‌రీష్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో-డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

Allari Naresh is coming up with an atypical film Naandhi
Author
Hyderabad, First Published Jun 27, 2020, 7:24 PM IST

టాలీవుడ్‌లో ఒకప్పుడు మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్‌ తరువాత ఆ రేంజ్‌లో సక్సెస్‌ ఇవ్వటంంలో ఫెయిల్‌ అయ్యాడు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న నరేష్‌ తాజాగా ఓ డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న 'నాంది' అనే విల‌క్ష‌ణ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు నరేష్‌. స్టార్ డైరెక్ట‌ర్‌ హ‌రీష్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో-డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి లాక్‌డౌన్ విధించ‌క ముందే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది. జూన్ 30 అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 'నాంది ఎఫ్ఐఆర్' (ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరిట ఒక చిన్న గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నారు .

'నాంది' ఎనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో అల్లరి నరేష్‌ నగ్నంగా కనిపించాడు. పోలీస్‌ స్టేషన్‌లో విచారణలో భాగంగా తీవ్రంగా దెబ్బలు తిన్న ముద్దాయిగా కనిపిస్తున్నాడు నరేష్‌. గతంలోనూ నరేష్‌ నగ్నంగా తలకిందులుగా వేలాడుతున్న ఫోటోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆ పోస్టర్‌లకు సూపర్బ్‌ రెస్సాన్స్‌ వస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios