టాలీవుడ్ హాట్ బ్యూటీ గా ప్రస్తుతం స్టార్ హీరోలతో జతకడుతున్న పూజా హెగ్డే ఇప్పట్లో తగ్గేలా లేదు. కుర్ర హీరోయిన్స్ గ్లామర్ తో ఎంత ఆకర్షిస్తోన్న బడా  హీరోలు అమ్మడివైపే చూస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు తనకంటే చిన్నవాడైన అఖిల్ తో కూడా ఈ బ్యూటీ నటించేందుకు సిద్దమైనట్లు సమాచారం. 

వరుస అపజయాల తరువాత అఖిల్ తన నాలుగవ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అయితే హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ గతకొంత కాలంగా అనేక మందిని పరిశీలించింది. ఇక ఫైనల్ గా స్టార్ డమ్ ఉన్న పూజా హెగ్డే ని సెలెక్ట్ చేసుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. 

అఖిల్ కంటే మూడేళ్లు పెద్దదైన పూజా స్క్రీన్ పై అఖిల్ కి ఎంతవరకు సెట్టవుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జస్ట్ డిస్కర్షన్స్ లో ఉన్న చిత్ర యూనిట్ పూజా విషయంలో వీలైనంత త్వరగా ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. లేకుంటే మలయాళం ముద్దుగుమ్మల వైపు యూ టర్న్ తీసుకునే అవకాశం ఉన్నట్లు టాక్.