ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా కోసం ఎన్టీఆర్ అట్లీ లేదా 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.

కానీ ఎన్టీఆర్ మాత్రం తన ఇమేజ్ తెలిసిన తెలుగు దర్శకుడితోనే సినిమా చేయడం బెటర్ అని నిర్ణయించుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని సంస్థలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 'RRR' గనుక పెద్ద హాట్ అయి.. ఎన్టీఆర్ కి పాన్ ఇండియా మార్కెట్ వస్తే త్రివిక్రమ్ తో చేసే సినిమానే భారీ స్థాయిలో రూపొందిస్తాడు. 

RRR: రామ్ చరణ్ కొత్త లుక్.. ఫోటో వైరల్!

పాన్ ఇండియా మార్కెట్ వచ్చినంత మాత్రం తెలుగు ఇండస్ట్రీని వదిలి ఇతర భాషలపై దృష్టి పెట్టడానికి తారక్ ఇష్టపడడం లేదు. తన ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. పరభాషా దర్శకులతో రిస్క్ చేయడం కంటే త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం ఉత్తమమని వారి పేర్లనే పరిశీలిస్తున్నాడు.

మరో విషయం ఏంటంటే. 'RRR'సినిమాలో ఎన్టీఆర్ తో పాటు నటిస్తోన్న రామ్ చరణ్ కూడా ఇలానే ఆలోచిస్తున్నాడు. 'RRR' సినిమాకి ఎలాంటి రిజల్ట్ వచ్చినా.. పరభాషా దర్శకుడితో సినిమా చేయడానికి ఇష్టపడడం లేదు. కొరటాల శివతో ఎప్పటినుండో చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ప్రస్తుతం 'RRR'షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎంతో కష్టపడుతున్నారు. ఇటీవల చిరంజీవి కూడా ఓ ఇంటర్వ్యూలో 'RRR'సినిమా షూటింగ్ లో భాగంగా రామ్ చరణ్ ని గొలుసులతో కట్టి హింసిస్తుంటే అతడి కష్టాన్ని చూసి ఏడుపు వచ్చేసిందని అన్నారు.

నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం  అందిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.