హీరో విజయ్ దేవరకొండ-ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ అంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విజయ్ దేవరకొండను ప్రశాంత్ నీల్ కలిసిన నేపథ్యంలో మూవీ సెట్ అయ్యిందని అంటున్నారు. దీనిపై ప్రశాంత్ నీల్ టీమ్ క్లారిటీ ఇచ్చారు.  

విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ మాన్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మృణాల్ ఠాకూర్ కి తెలుగులో మొదటి ప్లాప్ పడింది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు సుకుమార్ తో విజయ్ దేవరకొండ గతంలో ఓ ప్రాజెక్టు ప్రకటించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇదిలా ఉంటే... ప్రశాంత్ నీల్-విజయ్ దేవరకొండ కాంబోలో మూవీ అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళాడట. ఈ క్రమంలో మూవీ చేస్తున్నారని పుకార్లు షురూ అయ్యాయి. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మూవీ చేస్తున్నాడన్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ వచ్చింది. ప్రశాంత్ నీల్ టీమ్ ఇవన్నీ నిరాధార కథనాలు అని కొట్టి పారేశారు. 

ప్రశాంత్ నీల్ వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించి ఉన్నారు. సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనిలో ఆయన బిజీగా ఉన్నారు. త్వరలో సలార్ 2 షూటింగ్ మొదలవుతుందని సమాచారం. అనంతరం ఎన్టీఆర్ తో మూవీ చేయాల్సి ఉంది. సలార్ కి ముందే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ నుండి బయటకు రాలేదు. దాంతో ప్రశాంత్ నీల్ సలార్ మూవీ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ 2 చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.