మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఏ లుక్ లో కనిపించబోతున్నారనే విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది.

కొద్దిరోజుల క్రితం వరకు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా కోర మీసాలతో కనిపించారు. గడ్డం కాస్త తీసేసి మీసం బాగా పెంచి సరికొత్త గెటప్ లో కనిపించాడు రామ్ చరణ్. ఈ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే లుక్ తో రామ్ చరణ్ బాలీవుడ్ లో కొన్ని పార్టీలకు అలానే 'సైరా' సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ లో దర్శనమిచ్చారు.

'RRR': ఎన్టీఆర్, చరణ్ లకు నెలకి పదిలక్షలు!

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ వెండితెరని షేక్ చేయడం ఖాయమని అనుకున్నారు. కానీ తాజాగా రామ్ చరణ్ మరో లుక్ తో కనిపించారు. కోరమీసం తీసేసి ఎప్పటిలానే సింపుల్ లుక్ తో కనిపించారు రామ్ చరణ్. దీంతో అతడు లుక్ ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందనే సందేహాలు మొదలయ్యాయి.

ఈ విషయంపై 'RRR' యూనిట్ సభ్యుల్లో ఒకరు స్పందించారు. క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ కోసం రామ్ చరణ్ తన లుక్ ని మార్చుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.  సినిమాలో ఢిల్లీకి చెందిన కొన్ని ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఈ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ కాలేజ్ కి వెళ్లే విద్యార్ధిగా సింపుల్ లుక్ లో కనిపిస్తారన్నమాట. 

ఎప్పుడైతే అల్లూరి సీతారామరాజుగా దేశం కోసం పోరాడుతాడో ఆ సమయంలో మాత్రం రామ్ చరణ్ కోరమీసాలతో సరికొత్త అవతారంలో కనిపిస్తారని చెబుతున్నారు. దాదాపు బాహుబలి చిత్రానికి పనిచేసిన టీం ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కష్టపడుతోంది. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న చిత్రాన్ని విడుదల చేస్తారు.