Asianet News TeluguAsianet News Telugu

ఆ వైసీపీ నేతను గెలిపించండి.. దిల్ రాజు సంచలన వీడియో వైరల్


స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక వైసీపీ సీనియర్ నేతకు మద్దతు తెలిపాడు. ఆయనకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. 
 

producers dil raju supports ysrcp candidate balineni srinivasareddy requests vote for him ksr
Author
First Published Apr 24, 2024, 7:23 PM IST

ప్రొడ్యూసర్ దిల్ రాజు వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి తన మద్దతు ప్రకటించారు. ఆయనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ మేరకు దిల్ రాజు ఓ వీడియో విడుదల చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఐదుసార్లు ఒంగోలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ఆరవసారి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా నిలబడ్డారు.   వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలలో మంత్రిగా బాధ్యతలు నెరవేర్చాడు. ఒంగోలు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నేతకు ఓటు వేసి గెలిపించండి... అంటూ ఆ వీడియోలో దిల్ రాజు అభ్యర్థించారు. 

ఆయన ఇంకా మాట్లాడుతూ... బాలినేని రాజకీయ ప్రస్థానం పై ఒక డాక్యుమెంటరీ రూపొందించాను. అది అందరూ చూడాలని దిల్ రాజు వెల్లడించారు. దిల్ రాజు వీడియో వైరల్ గా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశానన్న దిల్ రాజు ఆయనను గొప్ప నేతగా అభివర్ణించారు. అంచెలంచెలుగా తాను ఎదుగుతూ ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డాడని దిల్ రాజు అన్నారు. 

మరోవైపు దిల్ రాజు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఆయన బ్యానర్ లో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ తెరకెక్కించాడు. నెక్స్ట్ దిల్ రాజు బ్యానర్ లో గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్. 

దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న నేపథ్యంలో అంజలి మరొక హీరోయిన్ గా చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల జరగండి జరగండి టైటిల్ తో ఫస్ట్ సాంగ్ విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios