Asianet News TeluguAsianet News Telugu

యంగ్ డాక్టర్ తో నితిన్ ఎఫైర్.. మ్యాచ్ ఫిక్స్ కాలేదంటూ వార్తలు!

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి గురించి అనేక వార్తలు వస్తున్నాయి. నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ నితిన్ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Tollywood Hero Nithin love affair with young hero
Author
Hyderabad, First Published Dec 20, 2019, 4:46 PM IST

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి గురించి అనేక వార్తలు వస్తున్నాయి. నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ నితిన్ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ మీడియాలో మాత్రం నితిన్ పెళ్లి ఫిక్స్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. 

నితిన్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఓ తెలుగు అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ యువతితో కొంతకాలంగా నితిన్ ప్రేమలో ఉన్నట్లు.. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పెళ్లి ఫిక్స్ అయినట్లు ప్రచారం జరిగింది. 

అంతా మోసం.. ఎలా లీక్ అయింది.. ఫోర్బ్స్ పై విరుచుకుపడ్డ హీరోయిన్ సోదరి

నితిన్ పెళ్లి దుబాయ్ లో జరగబోతోంది అని కూడా వార్తలు వచ్చాయి. మరికొన్ని మీడియా సంస్థలు నితిన్ ఓ యంగ్ డాక్టర్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడని.. త్వరలో వీరిద్దరి వివాహం జరగబోతున్నట్లు కథనాలు వచ్చాయి. దీనిపై నితిన్ సన్నిహితులు భిన్నంగా స్పందించారు.  

ఆంగ్ల మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం గత కొన్ని నెలలుగా నితిన్ తల్లిదండ్రులు అతడికి సరైన జోడీ కోసం వెతుకుతున్నారట. ఇంతవరకు ఏది ఫైనల్ కాలేదని అంటున్నారు. వీలైనంత త్వరగా నితిన్ కు పెళ్లి చేయాలనే ఆలోచనలో మాత్రం అతడి కుటుంబ సభ్యులు ఉన్నారట. నితిన్ పెళ్లి ఫిక్స్ ఐపోయిందంటూ వస్తున్న వార్తల్లో మాత్రం వాస్తవం లేదని అంటున్నారు. 

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ స్పందన.. త్వరలోనే చూస్తారు!

జయం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నితిన్ దిగ్విజయంగా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. మధ్యలో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడ్డప్పటికీ ఇష్క్ చిత్రంతో తిరిగి పుంజుకున్నాడు. ప్రస్తుతం నితిన్ కు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం నితిన్ భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios