Asianet News TeluguAsianet News Telugu

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ స్పందన.. త్వరలోనే చూస్తారు!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్. బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రూలర్ చిత్రం నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూలర్ చిత్రంలో బాలయ్యకు హీరోయిన్లుగా సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటించారు. 

Balakrishna Responds on Mokshagna entry as hero
Author
Hyderabad, First Published Dec 20, 2019, 3:07 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్. బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రూలర్ చిత్రం నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూలర్ చిత్రంలో బాలయ్యకు హీరోయిన్లుగా సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటించారు. 

ట్రైలర్స్, పాటలకు మంచి స్పందన రావడంతో రూలర్ చిత్రంపై అంచనాలు పెరిగాయి. చిత్ర యూనిట్ కూడా సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. బాలకృష్ణ స్వయంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొని రూలర్ చిత్రానికి ప్రచారం కల్పించారు. 

Balakrishna Responds on Mokshagna entry as hero

గత రెండేళ్లుగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీ సంగతి కేవలం రూమర్లకు మాత్రమే పరిమితమవుతోంది కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం రావడం లేదు. మోక్షజ్ఞ కూడా మీడియా కంట పడకుండా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాడు. అప్పుడప్పుడూ లీక్ అవుతున్న మోక్షజ్ఞ ఫోటోలు సామజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి స్పందించాడు. త్వరగా హీరో అయిపోవాలని మోక్షజ్ఞపై నేను ఒత్తిడి చేయడం లేదు. 

Balakrishna Responds on Mokshagna entry as hero

ప్రస్తుతం మోక్షజ్ఞ చదువు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తరచుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చర్చిస్తున్నా. త్వరలోనే అభిమానులంతా మోక్షజ్ఞని వెండితెరపై చూస్తారు అని బాలయ్య హామీ ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞతో బాలయ్య ఓ ఆలయంలో పూజలు నిర్వహించాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదంటూ అనేక రూమర్స్ వినిపించాయి. తాజాగా బాలయ్య ప్రకటనతో నందమూరి అభిమానులకు ఊపిరిపీల్చుకున్నారని చెప్పొచ్చు. 

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ మూవీలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా, కార్పొరేట్ అధినేతగా రెండు విభిన్నమైన గెటప్పులలో నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios