సోషల్‌ మీడియా అభివృద్ది చెందుతుండటంతో ప్రతీ ఒక్కరు తమ టాలెంట్‌ను షేర్ చేసుకునేందుకు ఆ వేదికలను చాలా బాగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా టిక్ టాక్ వచ్చిన తరువాత ప్రజల్లోని టాలెంట్‌ ఓ రేంజ్‌ లో బయటకు వస్తోంది. టిక్‌ టాక్‌లో ఫేమస్‌ అయిన చాలా మంది సెలబ్రిటీ స్టేటస్ కూడా అందుకున్నారు. సినిమాల్లోనూ టిక్‌ టాక్ నేపథ్యం కామెడీ సీన్స్‌ పెడుతున్నారంటేనే ఈ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా టిక్‌ టాక్‌లో అదరగొట్టిన ఓ అమ్మాయి బంపర్ ఆఫర్ వచ్చింది. తన సోషల్ మీడియా పేజ్‌ లో ఓ అమ్మాయి టిక్ టాక్ వీడియోను షేర్ చేసిన వర్మ ఆ వీడియోతో పాటు `నీకు నటనలో ఆసక్తి ఉంటే నీ డిటెయిల్స్‌ మెయిల్ చేయి` అంటూ ఓ మెయిల్‌ ఐడీని కూడా ఇచ్చాడు. గతంలో వర్మ తన సినిమాలో చాలా మంది కొత్త వారికి అవకాశాలు ఇచ్చాడు. నటీనటులతో పాటు దర్శకులు, ఇతర సాంకేతినిపుణులను చాలా మందిని వర్మ వెండితెరకు పరిచయం చేశాడు.

ఇక ఆ అమ్మాయి విషయానికి వస్తే `ఆక్వా గర్ల్ ఏకె` @aquagirlak అనే ఐడితో ఉన్న ఎకౌంట్ లో ఆ అమ్మాయి వీడియో పోస్ట్ అయ్యింది. గతంలో వర్మ మాట్లాడిన ఓ ఇంటర్య్వూలోని ఓ క్లిప్‌కు టిక్‌ టాక్‌ చేసింది అమ్మాయి. తన డైలాగే కావటంతో వెంటనే కనెక్ట్ అయిన వర్మ  ఆ అమ్మాయికి  యాక్టింగ్ ఆఫర్‌ ఇస్తానంటూ ముందుకు వచ్చాడు. మరి ఈ అమ్మాయి వర్మ ఆఫర్‌కు ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.