Asianet News TeluguAsianet News Telugu

KGF 2: ఫస్ట్ లుక్ తో షాకిచ్చిన యష్

ఒక కన్నడ సినిమాకి అంత సీన్ ఉందా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ విమర్శకుల నోళ్లు మూయించి రివ్యూలకు సైతం దిమ్మ తిరిగేలా వసూళ్లు అందుకుంది KGF ఛాప్టర్ 1.  ఇక రెండు వందల కోట్ల కలెక్షన్స్ తో నేషనల్ వైడ్ గా కన్నడ సినిమా స్థాయిని పెంచిన KGF హీరో యాష్ మరో ఆయుధాన్ని రెడీ చేస్తున్నాడు.

KGF 2 hero yash first look
Author
Hyderabad, First Published Dec 21, 2019, 8:26 PM IST

ట్రైలర్ తో బిల్డప్ ఇచ్చే సినిమాలు పెద్దగా ప్రభావం చూపవని ఓ వర్గం నుంచి వచ్చే కామెంట్ కి KGF సినిమా ఒక ప్రత్యేక ఉదాహరణ. సినిమా విడుదలకు ముందు నలు వైపులా తెలుగు హిందీ అని తేడా లేకుండా ప్రమోషన్స్ చేసి మరి  పాన్ ఇండియాల్ లెవెల్లో రిలీజ్ చేశారు. ఒక కన్నడ సినిమాకి అంత సీన్ ఉందా అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

బోల్డ్ సీన్లకు రెడీ.. 41ఏళ్ల హీరోయిన్ హాట్ కామెంట్స్!

కానీ విమర్శకుల నోళ్లు మూయించి రివ్యూలకు సైతం దిమ్మ తిరిగేలా వసూళ్లు అందుకుంది KGF ఛాప్టర్ 1.  ఇక రెండు వందల కోట్ల కలెక్షన్స్ తో నేషనల్ వైడ్ గా కన్నడ సినిమా స్థాయిని పెంచిన KGF హీరో యాష్ మరో ఆయుధాన్ని రెడీ చేస్తున్నాడు. KGF ఛాప్టర్ 2 ఫస్ట్ లుక్ ని ఇటీవల రిలీజ్ చేశారు. అసలు సినిమా మొదటి భాగమే ఒక రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

KGF 2 hero yash first look

ఇక సెకండ్ పార్ట్ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండడంతో అంచనాలను ఆకాశాన్ని దాటేశాయి.  ఒక్క కన్నడలోనే కాకుండా తమిళ్ తెలుగు హిందీ భాషల్లో ఎంతో మంది అభిమానులు ఈ సెకండ్ చాఫ్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.

జూ.ఎన్టీఆర్ పైనే ఆశలు.. అప్పుడైనా జోరు పెరుగుతుందా!

ఇక ఫస్ట్ లుక్ లో యష్ తన మాస్ స్టైల్ తో అదరగొట్టేశాడు. మొదటి పార్ట్ హిట్టవ్వడంతో అంతకంటే ఎక్కువ బడ్జెట్ తో సెకండ్ పార్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది చివరికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తేవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios