హీరోయిన్ భూమిక పేరు చెప్పగానే ఖుషి, సింహాద్రి, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. తన గ్లామర్ నటనతో, గ్లామర్ తో భూమిక యువతని మాయ చేయడంతో పాటు స్టార్ హీరోలకు గోల్డెన్ హీరోయిన్ గా మారింది. కొంతకాలం టాలీవుడ్ ఓ వెలుగు వెలిగిన తర్వాత భూమిక 2007లో వివాహ బంధంతో జీవితంలో సెటిల్ అయింది. 

 

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. ఇటీవల భూమికకు అవకాశాలు పెరుగుతున్నాయి. తాజాగా భూమిక బాలయ్య నటించిన రూలర్ మూవీలో కీలక పాత్రలో మెరిసింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెబ్ సిరీస్ లపై భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ప్రస్తుతం చాలా మంది నటులు వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు. నాకు కూడా వెబ్ సిరీస్ లపై ఆసక్తి ఉంది. అవకాశం వస్తే వెబ్ సిరీస్ లలో నటిస్తా నటిస్తా. పాత్ర డిమాండ్ చేస్తే బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటిస్తానేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాలుగు పదుల వయసులో ఉన్న భూమిక ఈ నిర్ణయం తీసుకోవడం సాహసమే. 

స్టార్ హీరోల ప్రభావంతో ఎదగలేకపోయిన అద్భుతమైన నటులు!

బాలీవుడ్ లో అడల్డ్ కంటెంట్ తో ఎక్కువగా వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. రమ్య కృష్ణ, మీనా లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. భూమిక పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించారు. 

వెండితెరపై విడుదల చేసేందుకు అవకాశం లేని కథలని వెబ్ సిరీస్ ల రూపంలో దర్శకనిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ యుగం నడుస్తుండడంతో వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మరి భూమిక ఆసక్తి తగ్గట్లుగా ఆమెకు వెబ్ సిరీస్ లో నటించే అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.