బాలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. గాయని కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యవహరం బాలీవుడ్‌ను కుదిపేసిన సంగతి తెలిసింది. ఆ తరువాత బడా నిర్మాత కరిం మొరానీ తో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లకు కూడా కరోనా పాజిటివ్ రావటంలో ఇండస్ట్రీలో భయం మొదలైంది. అయితే ఇప్పటికే కరీం ఇద్దరు కూతుళ్లు షాజా, జోయాలు కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరుకున్నారరు.

తాజాగా మరోసారి ఇండస్ట్రీ లో కరోనా కలకలం మొదలైంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్‌ ఖాన్ కూతురు, హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ సోదరి ఫరాఖాన్‌ అలీ ఇంట్లో పని చేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ ఇంట్లోని వారంతా సెల్ఫ్‌ క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులు సన్నిహితులతో పంచుకున్నారు.

అయితే ఈ కష్టకాలంలో మీరు ధైర్యంగా ఉండాలంటూ సలహా ఇచ్చింది పూజా బేడీ. నెటిజెన్లు కూడా వీరికి మద్ధతుగా మెసేజ్‌లు చేస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మహారాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ప్రభుత్వానికి మద్దతుగా తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.