Asianet News TeluguAsianet News Telugu

గ్రాండ్ పార్టీ.. క్రేజీ డైరెక్టర్స్ తో అల్లు అర్జున్ మెమొరబుల్ పిక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పార్టీలకు ఫేమస్.. ఈ విషయాన్ని బన్నీనే ఓ వేదికపై తెలిపాడు. చిత్ర పరిశ్రమలో మహానటి లాంటి కీలక చిత్రాలు సక్సెస్ సాధించినప్పుడు అల్లు అర్జున్ స్వయంగా పార్టీ ఇచ్చాడు.

Allu Arjun give grand party to tollywood Directors
Author
Hyderabad, First Published Feb 3, 2020, 7:06 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పార్టీలకు ఫేమస్.. ఈ విషయాన్ని బన్నీనే ఓ వేదికపై తెలిపాడు. చిత్ర పరిశ్రమలో మహానటి లాంటి కీలక చిత్రాలు సక్సెస్ సాధించినప్పుడు అల్లు అర్జున్ స్వయంగా పార్టీ ఇచ్చాడు. ఇక తన సినిమా రికార్డు విజయం సాధిస్తే ఊరుకుంటాడా.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల.. వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

ప్రస్తుతం ఈ చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అల్లు అర్జున్ మునిగి తేలుతున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్స్ నిర్వహించింది. తాజాగా టాలీవుడ్ ప్రముఖల కోసం బన్నీ ప్రత్యేకంగా ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సంధర్భంగా అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ దర్శకులందరితో దిగిన ఫోటో వైరల్ అవుతోంది.

ఛలో డైరెక్టర్ నమ్మక ద్రోహం.. వాడు వస్తానన్నా నేను రానివ్వను: నాగశౌర్య! 

ఈ ఫొటోలో నిర్మాత అల్లు అరవింద్, అల్లు అర్జున్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్ తో పాటు చాలా మంది స్టార్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ కనిపిస్తున్నారు. కొరటాల శివ, సురేందర్ రెడ్డి, కరుణాకరన్, విక్రమ్ కుమార్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి, మారుతి, పరుశురాం లాంటి దర్శకులంతా ఉన్నారు. 

4 గంటలు మాత్రమే.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ గురించి నాదెండ్ల క్లారిటీ!

త్రివిక్రమ్, అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని జోరు కనబరుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం 150 కోట్ల షేర్ కు చేరువైనట్లు తెలుస్తోంది. బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత టాలీవుడ్ లో అతిపెద్ద విజయంగా నిలిచింది. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios