పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు, సినిమాలు కూడా చేస్తూ జోడు గుర్రాల స్వారీ మొదలు పెట్టాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ పవన్ సన్నిహితులు మాత్రం.. ఆయన సినిమాలు చేస్తున్నప్పటికీ పూర్తి ధ్యాస రాజకీయాలపైనే అని అంటున్నారు. 

ఇటీవల పవన్ కళ్యాణ్ హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్ర రీమేక్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కనిపిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటూనే పవన్ మళ్ళీ అమరావతిలో రాజకీయ కార్యక్రమాల్లో ప్రత్యక్షమైపోతున్నాడు. దీని కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాన్ని ఉపయోగిస్తున్నారు. 

తల్లీ కూతుళ్ళ సరదా.. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న హీరో యష్ కుమార్తె వీడియో!

పవన్ కళ్యాణ్ ఇంతటి ఖర్చుతో ప్రత్యేక విమానాన్ని ఉపయోగించడంపై రాజకీయంగా అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. 

రాజకీయాల్లో ఏ టైంలో ఎం జరుగుతుందో తెలియదు. నేను సడెన్ గా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సిందే అని పవన్ నిర్మాతలకు కండిషన్ పెట్టాడట. దీనితో ఆయన సినిమాలు చేస్తున్న నిర్మాతలే పవన్ కోసం ప్రత్యేకంగా విమానాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా త్వరగా రాజకీయ కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్ లో పాల్గొనేందుకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పడంతో పవన్ అంగీకరించాడట. ఆ విమానంతో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సంబంధం లేదని నాదేండ్ల అన్నారు. 

ఏం పోయేకాలం రా మీకు.. బన్నీ, మహేష్ సినిమాలపై సంచలన కామెంట్స్!

అది కూడా పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం కేటాయిస్తున్న సమయం రోజులో నాలుగు గంటలు మాత్రమే. మిగిలిన సమయంలో ఆయన రాజకీయ కార్యక్రమాలే చేస్తున్నారు అని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్న పవన్.. తదుపరి క్రిష్, హరీష్ శంకర్ దర్శత్వంలో నటించబోతున్నారు. ఆయా తర్వాత కూడా గౌతమ్ తిన్ననూరి, పూరి జగన్నాధ్ లాంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.