Asianet News TeluguAsianet News Telugu

ఉన్నది ముగ్గురే ...అమరావతిని దేశ మ్యాప్‌లో పెట్టించారు: టీడీపీ నేత బీవీ జయనాగేశ్వర రెడ్డి

భారతదేశ చిత్ర పటంలో ఏపీ రాజధాని అమరావతిని చేర్పించేందుకు టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో గళమెత్తారన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.

tdp leader bv jaya nageshwar reddy comments on ysrcp
Author
Kurnool, First Published Nov 24, 2019, 8:47 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భారతదేశ చిత్ర పటంలో ఏపీ రాజధాని అమరావతిని చేర్పించేందుకు టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో గళమెత్తారన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో దేశ మ్యాప్ లో అమరావతిని చేర్చి తిరిగి మ్యాప్ ను విడుదల చేశారని బివి తెలిపారు.

ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పడంతో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం ప్రశ్నించలేని దయనీయ స్ధితిలో వైసీపీ ఉందన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన ఆర్డియస్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాల్సింది పోయి రీ టెండర్ పేరుతో కాలయాపన చేసి.. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. 

Also Read:హైదరాబాద్‌లో విషాదం: లిఫ్ట్ కింద నలిగి బాలుడి దుర్మరణం

అంతకుముందు దోపిడికి కేరాఫ్‌గా వైసీపీ మద్యం విధానం మారిందన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత కేఎస్ జవహర్. అధికారం చేపట్టిన 6 నెలల్లోనే రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత ఒక్క జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన మండిపడ్డారు. గ్రామగ్రామాన మద్యాన్ని ఏరులై పారిస్తూ..పచ్చని పల్లెలను నాటుసారా, గుడుంబా తయారీలకు కుటీరపరిశ్రమలుగా మార్చేశారని జవహర్ ఆరోపించారు.

వైకాపా ప్రభుత్వ వైఫల్యంతో గంజాయి విక్రయాలూ రాష్ట్రంలో జోరుగా  సాగుతున్నాయని.. సాక్షాత్తూ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్దే పెద్దమొత్తంలో పట్టుబడిన గంజాయి.. ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతోందని జవహర్ చురకలంటించారు. పైకి మద్యం నియంత్రణ పేరుతో అధిక రేట్లకు విక్రయిస్తూ ప్రజలను లూటీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Also Read:ఆరు నెలల్లోనే మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు: జగన్‌పై జవహర్ ఫైర్

జే ట్యాక్స్‌ ద్వారా మీరు ప్రవేశపెట్టిన సెలక్టెడ్‌ బ్రాండ్‌లు తాగిన ప్రజల ప్రాణాలు హరి అంటున్నాయని.. ఇంకొందరు ప్రాణాంతక వ్యాధుల పాలవుతున్నారని జవహర్ ఎద్దేవా చేశారు. రాజును బట్టే రాజ్యం, రౌతుని బట్టే గుర్రం అన్న సామెతగా ప్రభుత్వాన్ని నడిపించే నాయకత్వం ఎంత బాగా పనిచేస్తే రాష్ట్రం అంత అభివృద్ధి అవుతుందని ఆయన గుర్తు చేశారు.

హోంమంత్రి సుచరిత మంత్రి అయినప్పటికీ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నారని జవహర్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తమపై నెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు.

తెలుగుదేశం హయాంలో గంజాయి, సారాయిపై ఆధారపడేవారికి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా ప్రత్యామ్నాయం చూపమని జవహర్ గుర్తు చేశారు. వైఎస్సార్‌, జగన్మోహన్‌రెడ్డి హయాంలలోనే రాష్ట్రంలో బెల్టుషాపులు పెద్దసంఖ్యలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దీనిపై బహిరంగ చర్చకు వైకాపా సిద్ధమా..? అంటూ జవహర్ సవాల్ విసిరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios