fastest T20I hundred: నేపాల్ కు చెందిన కుశాల్ మల్లా నెలకొల్పిన ఫాస్టెస్ట్ టీ20 సెంచ‌రీ రికార్డు బ్రేక్ అయింది. కేవలం 33 బంతుల్లోనే విధ్వంసం సృష్టిస్తూ టీ20 చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయ‌ర్ గా నమీబియా క్రికెటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ చరిత్ర సృష్టించాడు. 

Namibian cricketer Jan Nicol Loftie-Eaton: ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ కు పేరుగాంచిన టీ20 క్రికెట్ లో మ‌రో స‌రికొత్త రికార్డు న‌మైంది. ప‌వ‌ర్ హిట్టింగ్ తో విధ్వంసం సృష్టిస్తూ అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ న‌మోదైంది. కేవ‌లం 33 బంతుల్లోనే సెంచ‌రీ కొట్టి కొట్టాడు న‌మీబియా ప్లేయ‌ర్. నేపాల్ కు చెందిన కుశాల్ మల్లా నెలకొల్పిన ఫాస్టెస్ట్ టీ20 సెంచ‌రీ రికార్డు బ్రేక్ అయింది. కేవలం 33 బంతుల్లోనే విధ్వంసం సృష్టిస్తూ టీ20 చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయ‌ర్ గా నమీబియా క్రికెటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ చరిత్ర సృష్టించాడు.

నేపాల్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ లో నమీబియా ప్లేయ‌ర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ టీ20 ఇంటర్నేషనల్ (T20I) చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 2023లో ఆసియా క్రీడల సందర్భంగా మంగోలియాపై 34 బంతుల్లో రికార్డు సెంచ‌రీ కొట్టిన నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా పేరిట ఉన్న గత రికార్డును లాఫ్టీ-ఈటన్ 33 బంతుల్లోనే ఛేదించాడు. నేపాల్‌తో జరిగిన టీ20లో 22 ఏళ్ల లోఫ్టీ-ఈటన్ 36 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఈ యంగ్ ఎడమచేతి వాటం హిట్టర్ తన ఇన్నింగ్స్‌ను 280.56 స్ట్రైక్ రేట్‌తో ముగించ‌డం విశేషం.

నువ్వు ఇంతకు మించి ఏమి పీకలేవురా.. : హ‌నుమ విహారిపై ఆంధ్ర ప్లేయ‌ర్ హాట్ కామెంట్స్.. !

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 206/4 ప‌రుగులు చేసింది. ఓపెనర్లు మైఖేల్ వాన్ లింగెన్ (19 బంతుల్లో 20), మలన్ క్రుగర్ (48 బంతుల్లో 59*) శుభారంభం ల‌భించింది. ఆ త‌ర్వాత కొద్ద సేప‌టికే 62/3 వ‌ద్ద క్రీజులోకి వ‌చ్చిన జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్.. క్రుగర్‌తో క‌లిసి విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతూ నేపాల్ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. వీరిద్ద‌రూ నాల్గవ వికెట్‌కి 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

టీ20 క్రికెట్ లో ఫాస్టెస్టు సెంచ‌రీ.. 

నేపాల్‌పై సెంచరీ చేసిన తర్వాత లాఫ్టీ-ఈటన్ ఫాస్టెస్టు టీ20 సెంచరీ సాధించిన ప్లేయ‌ర్ల లిస్టులో టాప్ లో నిలిచాడు. అంత‌కుముందు, నేపాల్ ప్లేయ‌ర్ కుశాల్ మల్లా 34 బంతుల్లో టీ20 సెంచరీ సాధించ‌గా, ఇప్పుడు దానిని ఈట‌న్ బ్రేక్ చేశాడు. టీ20 క్రికెట్ లో ఫాస్టెస్టు సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్ల లిస్టులో ఆ త‌ర్వాత స్థానాల్లో దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, చెక్ రిపబ్లిక్‌కు చెందిన సుధేష్ విక్రమశేఖర సంయుక్తంగా మూడో స్థానంలోకి చేసురుకున్నారు. ఈ ముగ్గురూ 35 బంతుల్లోనే టీ20ల్లో సెంచరీలు చేశారు. అక్టోబర్ 2017లో పొట్చెఫ్‌స్ట్రూమ్‌లో బంగ్లాదేశ్‌పై మిల్లర్ 36 బంతుల్లో 101* పరుగులు చేశాడు. డిసెంబర్ 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై రోహిత్ సెంచరీ కొట్టాడు. ఆగస్ట్ 2019లో ఇల్ఫోవ్ కౌంటీలో జరిగిన కాంటినెంటల్ కప్‌లో టర్కీపై విక్రమశేఖర 36 బంతుల్లో 104* పరుగులు చేశాడు.

ఆంధ్రా క్రికెట్ వివాదంలోకి దూరిన అశ్విన్.. హనుమ విహారీ రియాక్ష‌న్.. !

Scroll to load tweet…

Mohammed Shami: ఆస్ప‌త్రి బెడ్ పై ష‌మీ.. కాలుకు స‌ర్జ‌రీ.. ఏం జ‌రిగింది?