మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి సఫిల్‌గూడ  మినీ ట్యాంక్‌బండ్‌పై ఆదివారం నాడు మార్నింగ్ వాక్ నిర్వహించారు.వాకర్స్‌ను పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని రేవంత్ రెడ్డి కోరారు. తనను గెలిపిస్తే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.