Asianet News TeluguAsianet News Telugu

Vampire facial: అందం కోసం ఆరాట పడితే.. ప్రమాదంలో పడ్డ ప్రాణాలు.. అసలేం జరిగిందంటే?

Vampire facials: ఇటీవల కొంత మంది తమ వృద్ధాప్యాన్ని దాచుకోవడానికి కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా రకరకాల కాస్మెటిక్ సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. అందులో వాంపైర్ ఫేషియల్ ఒకటి.  ఆ ఫేషియల్ చేయించుకోవడం వల్ల అందంగా కనిపించడం మాట దేవుడేరుగు. మొదటికే మోసానికి వచ్చినట్టు .. ప్రమాదకర హెచ్ ఐవీ వైరస్ బారిన పడ్డారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం? 

Vampire facials lead to women catching HIV CDC reports cases of transmission via cosmetic procedures KRJ
Author
First Published Apr 27, 2024, 10:18 AM IST

Vampire facial: ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని, యవ్వనంగా కనిపించాలని ఎన్నో ఎన్నో ఫేసియల్స్ చేయించుకుంటారు. ఇవి తాత్కలిక ఉపశమనాన్ని ఇచ్చినా అత్యాధునిక శాస్ర్త చిక్సితలు, స్కిన్ కేర్ థెరఫీలు చేయించుకుంటారు. ఇలాంటి తరుణంలో కొంతమంది తమ ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందంటే నమ్ముతారా? ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటనతో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి.  అమెరికా లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం..  న్యూ మెక్సికోలోని స్పాలో వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలు ప్రాణాంతకమైన HIV బారిన పడ్డారని CDC తెలిపింది. 
 
అసలేం జరిగింది? 

వాంపైర్ ఫేషియల్‌లో చేతుల నుండి రక్తాన్ని తీసి ముఖంపై ఇంజెక్ట్ చేస్తారు. దీనిని ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా మైక్రోనెడ్లింగ్ ప్రక్రియ అంటారు. దీనిని సాధారణంగా ఫేషియల్ అని పిలుస్తారు. 2018లో మెక్సికోలోని ఓ స్పా (బ్యూటీ పార్లర్ )లో కొంత మంది మహిళలు వాంపైర్ ఫేషియల్ చేయించుకున్నారు. అనంతరం ఆ మహిళలను పరీక్షించగా.. వారికి హెచ్ఐవి సోకినట్లు తేలింది. మహిళలకు వాడే కాస్మోటిక్ ఇంజెక్షన్ల వల్లే హెచ్‌ఐవీ బారిన పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. RML హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అంకిత్ కుమార్ మాట్లాడుతూ.. HIV సోకిన వ్యక్తి  రక్తం ఒక వ్యక్తి యొక్క శరీరంలోకి ప్రవేశించడం వల్ల HIV వస్తుందని చెప్పారు.

CDC అన్ని విధాలుగా పరిశోధించింది. మహిళ ఇంజెక్షన్ ద్వారా మందులు తీసుకోలేదని లేదా ఆమెకు సోకిన రక్తమార్పిడి ఇవ్వలేదని లేదా ఆమె HIV పాజిటివ్ వ్యక్తితో శారీరక సంబంధం కలిగి లేదని కనుగొనబడింది. కాస్మెటిక్ ఇంజెక్షన్ కారణంగా బాధితురాలికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు తేలింది. లైసెన్స్ లేకుండా నడుస్తున్న స్పాల నిర్లక్ష్యం అనే సమస్య 2019 సంవత్సరంలో కూడా తలెత్తింది. న్యూ మెక్సికో ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యల తర్వాత ఈ స్పా మూసివేయబడింది. అలాగే ఇక్కడ ఫేషియల్ వాంపింగ్ చేయించుకున్న వారికి అనేక పరీక్షలు ఉచితంగా చేయిస్తామని ఆదేశాలు ఇచ్చారు. అలాగే  స్పా లోని వెళ్లే సుమారు 200 మందిని పరిశీలించారు. అయితే.. వారిలో ఎవరికీ వ్యాధి సోకలేదని తేలింది.
వాంపైర్ ఫేషియల్ అంటే ఏమిటి?

వాంపైర్ ఫేషియల్స్(Vampire facial) అనే ట్రిట్మెంట్ కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ కాస్మెటిక్ ప్రక్రియ ద్వారా ముడతలు పడ్డ చర్మాన్ని యవ్వనంగా మారుస్తారు. అలాగే.. మొటిమలు, మచ్చలు, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (AAD) ప్రకారం.. ఈ వాంపైర్ ఫేషియల్ ప్రక్రియ మొత్తం 40 నుండి 50 నిమిషాలు పడుతుంది. ముఖంపై మచ్చలు లేదా ఇతర గుర్తులు ఉంటే..వాటిని తొలగించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. చేతి నుంచి తీసిన రక్తాన్ని ఇంజక్షన్ సహాయంతో అదే వ్యక్తి ముఖంపై ఇంజెక్ట్ చేస్తారు. వాంపైర్ ఫేషియల్ వంటి పద్ధతులను ప్రయత్నించిన తర్వాత.. ఈ ప్లేట్‌లెట్స్ కొత్త చర్మ కణాలు, కొల్లాజెన్‌ల పెరుగుదలను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. ఇది చర్మం  ఆకృతిని మెరుగుపరుస్తుంది. సరైన అనుభవం ఉన్న డాక్టర్ చేతనే ఈ ట్రిట్మెంట్ చేయించుకోవాలని నిణుపులు తెలుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios